Home
ఫ్లాప్‌ల పరంపర నుంచి తనను గట్టెక్కిస్తుందని బాలకృష్ణ ఆశించిన వీరభద్ర సినిమా వీర ఫ్లాప్ కావడం ఆయనను, ఆయన అశేష అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ భారీ బడ్జెట్ సినిమాలో బాలకృష్ణ కసిగా, పదునుగా నటించినా ఉపయోగం లేకుండా పోయింది. బాలకృష్ణ ఇప్పుడు తన తదుపరి సినిమా మీద దృష్టి పెట్టారు. చంద్రముఖి ఫేం పి. వాసు దర్శకత్వంలో ఆయన నటించనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సంగీత విధ్వాంసుడి పాత్రలో నటించనున్నారని మాత్రమే చెప్పిన వాసు మిగితా వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. ఫ్యామిలీ టైప్ హీరోయిన్లు మీరా జాస్మిన్, స్నేహ ఇందులో నటిస్తున్నారు. ఈ కొద్ది వివరాలను బట్టి ఇది కుటుంబ కథా చిత్రమని వేరే చెప్పనవసరం లేదు.


Click it and Unblock the Notifications











