Home

By Staff

ఏప్రిల్‌ 20 నుంచి మే 4 లోపు నాలుగు భారీ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాల బిజినెస్‌ 60 కోట్ల పై మాటే. ఈ వేసవి సినిమాల మీదే ఈ ఏడాది తెలుగు సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రభాస్‌- ఎంఎస్‌ రాజు సినిమా పౌర్ణమి ఏప్రిల్‌ 20న విడుదల కానుంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష, చార్మి, మధుశర్మ హీరోయిన్లుగా నటించారు. మహేష్‌బాబు- పూరీ జగన్నాధ్‌ల భారీ చిత్రం పోకిరి ఏప్రిల్‌ 28న విడుదల కానుంది. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలున్నాయి. సినిమా రంగ ప్రముఖులు ఈ సినిమాకు సంబంధించి అనేక ప్రాంతాల ప్రదర్శన హక్కులను పొందారు. ఏప్రిల్‌ 29 ఉదయం బాలకృష్ణ సినిమా వీరభద్ర విడుదల కానుంది. ఇక పవన్‌ కళ్యాణ్‌ బంగారం సంగతి వేరే చెప్పనవసరం లేదు. సమ్మర్‌ సినిమాల్లో దీనికి వచ్చినంత పబ్లిసిటీ మరో సినిమాకు రాలేదు. ఈ సినిమా మే 4న విడుదల కానుంది. ఈ నాలుగు సినిమాల్లో రెండు మాత్రమే సూపర్‌హిట్‌ రేంజికి వెళ్తాయని, మిగితా వాటి భవిష్యత్తు అవి విడుదలైన తర్వాత కానీ తెలియదని సినిమా పండితులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X