Home
పవన్ కళ్యాణ్‌తో మెగా నిర్మాత ఎఎం రత్నం దాదాపుఉ రెండేళ్ళ పాటు నిర్మించిన బంగారం బాక్సాఫీసు వద్ద నీరసపడడంతో క్రైసిస్ మేనేజ్‌మెంట్ జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చక్కగా నటించినప్పటికీ దర్శకుడు ధరణి సెకండాఫ్‌ను బాగా డ్రాగ్ చేశారు. అనవసర ఫైట్ సన్నివేశాలు ఉండడంతో కథా గమనం దెబ్బతింది. సెకండాఫ్‌ను ట్రిమ్ చేస్తే ఈ సినిమా బాగా ఆడుతుందని దాదాపు అందరూ అభిప్రాయపడడంతో నిర్మాత రత్నం సెకండాఫ్‌లో దాదాపు 22 నిముషాల పార్టును ట్రిమ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నచ్చడం లేదు. సినిమా ఫ్లాప్‌కు దర్శకుడు ధరణి కారణమని వారు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోతుండడంతో దాదాపు 20 కోట్లు ఖర్చు చేసిన రత్నం ట్రిమ్మింగ్ మార్గాన్ని ఎంచుకున్నారు.


Click it and Unblock the Notifications











