సి
షారుఖ్ ఖాన్ కింగ్ అయితే మరి మీరేమిటి? అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు - నేను ఆసుని అని చెప్పగలిగిన మేటి నటుడు అమీర్ ఖాన్ ప్రస్తుతం మణిరత్నం రూపొందించే గురు చిత్రంలో కరీనాకపూర్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. గొల్లపూడి శ్రీనివాస్ అవార్డుల ప్రదానోత్సవానికి చెన్నై విచ్చేసిన అమీర్‌ఖాన్ - మురుగుదాస్ దర్శకత్వం వహించిన గజనీ చిత్రం చూశారు. సూర్య, ఆసిన్ నటించిన ఆ తమిళ చిత్రాన్ని చూసి అమీర్ ఖాన్ చాలా ముచ్చటపడ్డారట. పైగా ఈ చిత్రాన్ని తాను హిందీలో రీమేక్ చేసి, నటిస్తానని కూడా చెప్పేశారట. అమీర్ ఖాన్ ఇంతవరకూ ఒక్క రీమేక్ చిత్రంలో కూడా నటించలేదు. అటువంటి ఆయనే గజనీ రీమేక్ చేస్తానని, హీరోగా కూడా నటిస్తానని చెప్పడం విశేషం. అంతేకాకుండా, గజనీలో ఆసిన్ నటన చూసి తెగ ముచ్చటపడిన అమీర్ ఖాన్ ఉన్నపళంగా నటి ఆసిన్‌ను రప్పించుకుని ఆమె నటనా ప్రతిభని మనసారా అభినందించారట. గజనీ దర్శకుడు మురుగుదాస్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టాలిన్ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే!


Click it and Unblock the Notifications











