For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శివరాత్రికిమల్లీశ్వరి

    By Staff
    |

    హిందీలో ఇటీవలే విడుదలైన మలామల్‌ వీక్లీ చిత్రం రీమేక్‌ హక్కులు తీసుకుని తెలుగులో రూపొందిస్తున్న చిత్రానికి భాగ్యలక్ష్మీ బంపర్‌ డ్రా అని టైటిల్‌ నిర్ణయించారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌ ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇంకా రిషి (ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌ ఫేమ్‌), ఫర్జానా, కిరణ్‌రాథోడ్‌ ప్రధాన పాత్రధారులు.

    ప్రదీప్‌ గైక్వాడ్‌ సమర్పణలో సిల్వర్‌స్క్రీన్‌ మూవీస్‌ పతాకంపై రాజు, ప్రవీణ్‌, శ్యామ్‌సుందర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి దర్శకులు నిధి ప్రసాద్‌ మాట్లాడుతూ, గ్రామీణ నేపథ్యంలో సాగే కామెడీ ఎంటర్‌టైనర్‌ ఇది. నా దర్శకత్వంలో ఇంతవరకూ వచ్చిన నిధి, హోలీ, అందరూ దొంగలే చిత్రాన్నీ ఒకదానితో ఒకటి పోలిక లేనివే. ఈ సినిమా కూడా వాటికి భిన్నంగా ఉంటుంది. హిందీలో ఘన విజయం సాధించిన మాలా మాల్‌ వీక్లీ సినిమా ఆధారంగా తెలుగుకు కావాల్సిన మార్పులు చేర్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. హిందీ సినిమాలో పాటలు లేవు. కానీ తెలుగులో సందర్భానుసారంగా ఐదు పాటల్ని పెట్టాం. అలానే కొన్ని పాత్రలనూ జత చేశాం. చక్రి సంగీతాన్ని అందిస్తున్నారు అని చెప్పారు.

    పల్లెటూరిలో నివసించే ఓ వ్యక్తికి హఠాత్తుగా కోటి రూపాయలు లాటరీ వచ్చినప్పుడు ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయన్నదే కథలోని ప్రధానాంశం. ఈ సినిమాలో ఉన్న ఓ పాత్రపేరు భాగ్యలక్ష్మి. అలానే లాటరీకి సంబంధించిన విషయమూ భాగ్యలక్ష్మితో ముడిపడి ఉంటుంది. అందుకనే ఈ పేరు ఖాయం చేశాం. దాదాపు ఆరు సంవత్సరాల విరామం తర్వాత ఎల్‌.బి. శ్రీరామ్‌ రాస్తున్న మాటలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి అని దర్శకుడు నిధి ప్రసాద్‌ చెప్పారు. భరణి, బ్రహ్మానందం, వేణు మాధవ్‌, నాగబాబు, ఆలీ, కృష్ణభగవాన్‌, ఎమ్మెస్‌ నారాయణ, ఎల్‌.బి. శ్రీరామ్‌, కొండవలస, బెనర్జీ, మల్లికార్జునరావు, రాంజగన్‌, కాదంబరి కిరణ్‌, ఆదాం, కోవై సరళ, అభినయశ్రీ, సీమ, భువనేశ్వరి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: శరత్‌, ఎడిటర్‌: శంకర్‌, ఫైట్స్‌: రామ్‌ లక్ష్మణ్‌.

    ఒక పాటతో సహా టాకీ మొత్తం పూర్తయిందని, దసరా కానుకగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.

    మరిన్నికథనాలు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X