ఔరా! అనిపించిన పూరి.... వాళ్లు మగ లేడీస్!
ఇటీవల జరిగిన 'దేవుడు చేసిన మనుషులు' ఆడియో ఫంక్షన్లో బికినీలను తలపించే డ్రెస్సుల్లో డాన్స్ చేసిన థాయ్ లాండ్ భామలు చూసే వారి మతులు పోగొట్టేసిన విషయం తెలిసిందే. ఈ అందాలు ఎక్కడి నుంచి వచ్చాయిరా! అంటూ కొందరు వాళ్ల షో అయిపోయేదాకా కళ్లార్పకుండా చూశారు.
వాళ్ల అందాలు, ఒంపుసొంపులు, వయ్యారాలు చూసి అబ్బదాని సోకు....అనుకున్న వాళ్లంతా ఫూల్స్ అయినట్లే. ఎందుకంటే వాళ్లంతా ఆడవేశం వేసుకుని నర్తించిన మగాళ్లు. వీళ్లని ట్రాన్స్‌వెస్టిజన్స్ అంటారు. ఆడవాళ్ల డ్రెస్‌లు వేసుకుని డాన్స్ షోలు ఇచ్చే మగాళ్ల గ్రూఫు అన్నమాట. థాయ్‌లాండ్‌లో వీళ్లు నిర్వహించే 'టిఫనీ'షోలు చాలా ఫేమస్. తాజాగా ఆ టిఫనీ షోను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు పూరి.
మాస్ మహరాజా రవితేజ, క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఇలియానా హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. బివిఎస్ ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం పతాకంపై ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. గతంలో పూరి జగన్నాథ్-రవితేజ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. ఇది వారిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఐదో సినిమా.
బివిఎస్ ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం పతాకంపై ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. గతంలో పూరి జగన్నాథ్-రవితేజ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. ఇది వారిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఐదో సినిమా. ఈసినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎంఎస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు, ఫిష్ వెంకట్, జ్యోతిరానా తదితరలు నటిస్తున్నారు. సంగీతం: రఘు కుంచె, ఎడిటింగ్: ఎస్ ఆర్ శేఖర్, నిర్మాత: బివిఎస్ఎం ప్రసాద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











