Tiger Nageshwar టైగర్ నాగేశ్వరరావుపై భారీగా కత్తెర.. ఆ సీన్లను ఓ రేంజ్‌లో లేపేశారట!

స్టూవర్ట్‌పురంలో పేరు మోసిన దొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు సినిమా రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించారు. మాస్ మహారాజ్ రవితేజ, నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, అనుపమ్ ఖేర్, మురళీశర్మ, రేణుదేశాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కొన్ని విషయాల్లో వ్యక్తమైన తీవ్ర అభ్యంతరాల వివరాల్లోకి వెళితే..

మాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. కానీ కథ, కథనాల్లో స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు ఉన్నాయనే అభిప్రాయం తొలి ఆట తర్వాత వ్యక్తమైంది. ఈ సినిమాకు ప్రధానంగా నిడివి నెగిటివ్‌గా మారింది. ఈ సినిమా నిడివిని 164 నిమిషాలకుపైగా పెంచారు. దాంతో సినిమాలో ఉండే ఫీల్ గుడ్ అంశాలను ఎలివేట్ చేయకుండా అడ్డుకొన్నదనే అభిప్రాయం వ్కక్తమైంది.

Tiger Nageshwar Rao runtime slashed to 2.37 minutes after heavy trolls on the movie duration

టైగర్ నాగేశ్వరరావు సినిమా సెకండాఫ్‌లో రిపీట్ సీన్లు వేయడం ప్రేక్షకుల సహనానికి పరీక్షలా అనిపించింది. దాంతో ఈ సినిమాకు నిడివి తగ్గించి ఉంటే బెటర్ అవుట్‌పుట్, ఫీల్ ఉండేదనే అభిప్రాయాలను చిత్ర యూనిట్ పరిగణనలోకి తీసుకొన్నది. దాంతో ఈ సినిమా నిడివిపై కత్తెర వేసింది.

టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ తర్వాత రెండో రోజు నిడివిని తగ్గిస్తూ చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకొన్నది. 182 నిమిషాల నిడివి నుంచి కొంత తగ్గించింది. 157 నిమిషాలకు తగ్గించింది. మొత్తంగా ఈ సినిమాలోని 25 నిమిషాల కంటెంట్‌ను తొలగించారు. దాంతో ఈ సినిమా నిడివి ప్రస్తుతం 2.37 గంటలుగా నిర్ణయించారు. నిడివి తగ్గించిన తర్వాత సినిమాలో ఫీల్ పెరుగుతందా? ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

Tiger Nageshwar Rao runtime slashed to 2.37 minutes after heavy trolls on the movie duration

టైగర్ నాగేశ్వరరావు సినిమా తొలి రెండు రోజుల్లో ఓ మోస్తారు కలెక్షన్లు సాధించింది. తొలి రోజు 9 కోట్లకుపైగా, రెండో రోజు 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా 17 కోట్ల రూపాయలను ఈ సినిమా వసూలు చేసింది. రానున్న రోజుల్లో ఏ రేంజ్‌లో కలెక్షన్లు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X