For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దారుణం : కుర్ర హీరో ఏదో సరదాగా ఫొటో పెడ్తే...ఇంతలా వెటకారాలు, కామెడీలా?

  By Srikanya
  |

  ముంబయి: ఇవి సోషల్ మీడియా రోజులు, తమ అభిప్రాయాన్ని, మనస్సులో ఉన్నది ఉన్నట్లుగా ఫేస్ బుక్, ట్విట్టర్ సాక్షిగా బయిటపెట్టేస్తున్నారు. ఇంతకు ముందు ఎవరో ఏమనుకుంటారో, అయినా మనం మాట్లాడటానికి సరైన ప్లాట్ ఫాం ఏది అనుకున్నవారందరికీ సోషల్ మీడియా ఆహ్వానం పలికింది.

  ముఖ్యంగా సెలబ్రెటీలను ట్రోల్ చేయటంతో ఈ అభిప్రాయాలను చెప్పటం అనే కార్యక్రమం జోరందుకుంటోంది. ఫొటో షాప్, ఆన్ లైన్ ఫొటో ఎడిటర్స్ దొరుకుతున్న ఈ రోజుల్లో హీరో, హీరోయిన్స్ ఫొటోలను మార్చి, ఫన్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కుర్రకారు. అఫ్ కోర్స్ మితిమీరనంతవరకూ బాగానే ఉంటుందనుకోండి. తాజాగా వారి దృష్టి బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ పై పడింది.

  బాలీవుడ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ మూవీలు బాక్స్ ఫీస్ వ‌ద్ద బోల్తా కొడుతున్న అత‌డి జోరు త‌గ్గ‌డం లేదు.. మ‌రో రెండు మూవీల్లో అత‌డు న‌టించ‌నున్నాడు.. ఈ ఆనందంతో టైగ‌ర్ త‌న సిక్స్ ప్యాక్ బాడీతో అదరకొట్టే పనిలో పడ్డాడు. అంతేకాదు రీసెంట్ గా ట్విట్టర్ లో ఓ ఫొటో పెట్టాడు.

  అందులో ఆయన ఒక కాలు మీద నిలబడి మరో కాలుని నిటారుగా పైకి పెట్టుకుని ఫొటోకు పోజిచ్చారు. దానికి ఓ చక్కటి క్యాప్షన్‌ కూడా రాశారు. అయితే.. ఆ ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. దానికి అబిమానుల స్పందన చూస్తే మీరు నవ్వుతూనే ఉంటారు. వారు అతన్ని ట్రోల్ చేస్తూ కామెడీ చేసారు.

  దాంతో ఉత్సాహంగా ఫ్యాన్స్ కొందరు టైగర్‌ పోజును కట్‌ చేసి సరదాగా వేర్వేరు ఫొటోలతో సెట్‌ చేశారు. ఆ ఫొటోలు చూస్తే.. ఇప్పుడు మీరూ తప్పక నవ్వుకుంటారు. ఇదిగో అలాంటి ఫొటోలు వరసగా చూడండి మరి. ఆ ఫోటోల‌పై మీరూ ఓ లుక్కేయండి..

  ఫ్లాఫైనా కుర్రాడుకి ఆఫర్సే ఆఫర్స్

  ఫ్లాఫైనా కుర్రాడుకి ఆఫర్సే ఆఫర్స్

  బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ డ్యాన్స్‌, ఫిట్‌నెస్‌లను అభిమానులు ఎక్కువ ఇష్టపడుతుంటారు. హీరోపంతి, బాఘీ, ఏ ఫ్లయింగ్‌ జాట్‌ చిత్రాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేకపోయినా, టైగర్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌కి మాత్రం బీ-టౌన్‌లో మంచి క్రేజ్‌ ఏర్పడింది. ఇదిగో చూడండి.. ఈఫోజ్ లో భలే ఉన్నాడే.

  కాలుతోనే ఫైటింగ్

  కాలుతోనే ఫైటింగ్

  కాలు ఎత్తి పెట్టిన మనోడు పొటోని ఇదిగో ఇలా మార్చేసారన్నమాట. చూస్తుంటేనే నవ్వు వస్తోంది కదా. అవును మరి ఎదుటివాడు కత్తితో నిలబడితో మనోడు కాలుతో పైట్ అంటే భలే ఉంటుంది కదా

  ముందుకు , పైకి

  ముందుకు , పైకి

  ముందు వెళ్తున్నవాడు కాలు ముందుకు వస్తే , మన హీరో మాత్రం కాలుని ఇలా పైకి ఎత్తుతున్నాడన్నమాట. ఇలా కాలు పైకి ఎత్తటం అంటే మాటలా. ఇలాంటి టాలెంట్ కొద్ది మందికే ఉంటుంది. మనోడు అందులో ఫస్ట్ లాగ ఉన్నాడు .

  హిట్లర్ సైన్యంలోనూ హీరోగారూ

  హిట్లర్ సైన్యంలోనూ హీరోగారూ

  మనోడు హిట్లర్ టైమ్ లో పుట్టి ఉండి ఉంటే ఎలా ఉండేది అనే చిలిపి ఆలోచనను ఇలా ఫోటో షాప్ లో చేసి ఫన్ చేస్కుకుంటున్నారు జనం. అందరూ హిట్లర్ కు చేతులు పైకి ఎత్తి గౌరవం చూపుతుంటే మనోడు మాత్రం కాలు ఎత్తి మరీ...దేవుడా..ఏంటీ ఆలోచన.

  దేముడా..ఏంటిది

  దేముడా..ఏంటిది

  మైకలాంజిలో ఫేమస్ చిత్రాన్ని ఇదిగో ఇలా మనోడుని కలిపేసి ఫన్ పుట్టించేసారు ఈ ఫేస్ బుక్ జనం. అటు జాకీ ష్రాఫ్ తన కొడుకుని ఇలా అందుకుందామని చెయ్యి ఇస్తే..మన హీరో గారు మాత్రం కాలుతో అందుకునే ప్రయత్నం చేస్తున్నాడన్నమాట. శభాషో శబాష్.

  కేక పెట్టించారు..

  కేక పెట్టించారు..

  షారూఖ్ ఖాన్ చిత్రం డీడీఎల్ జే లో ఈ సీన్ ఎంత పేమసో మీకు గుర్తుండే ఉండి ఉంటుంది. అదే సినిమాలో మనడు చేసి ఉంటే చెయ్యి అందించవాడు కాదట...ఇదిగో ఇలా కాలు అందించేవాడని కామెడీ చేస్తున్నారు..ఈ పంచ్ మాత్రం అదిరింది కదూ.

  పైపైకి..రాకెట్ లా

  పైపైకి..రాకెట్ లా

  మనోడు కెరీర్ కూడా ఇలాగే రాకెట్ లాగ దూసుకువెళ్లాలనేమో కానీ అంత నిటారుగా తన కాలుని మాత్రం ఎక్కడా వంచకుండా పెట్టగలిగాడని అభిమానులు ఇదిగో ఇలా పోల్చి సంబరపడ్డారో లేక ట్రోల్ చేసారో ...

  కాలుత్తి మరీ ప్రజెంట్ సార్

  కాలుత్తి మరీ ప్రజెంట్ సార్

  సాధారణంగా జనం అంతా క్లాసులో ప్రెజెంట్ సార్ అని ఇలా అంటారు..మన హీరో మాత్రం ఇదిగో ఇలా కాలు ఎత్తి తాను వచ్చానని ప్రెజెంట్ చెప్తాడంట. ఇది భలే ఫన్నీగా ఉంది కదూ.. ఏదైనా సోషల్ మీడియా జనం భలే క్రియేటి విటీ.

  టైగర్ ని ఇలా వాడేసారు

  టైగర్ ని ఇలా వాడేసారు

  ఇది జాకీ ష్రాఫ్ ఫ్యాన్ క్లబ్ వాళ్లు వదిలింది. వాళ్లు తమ హీరో అలా కాలు ఎత్తటం చూసి మురిసి పోతూ ఇదిగో ఇలా ఫొటో డిజైన్ చేసి వదిలారు. టౌన్ లో కి కొత్త బైక్ వచ్చిందంటూ , ఎవరి అభిమానం వాళ్లది.

  టైం అడిగితే ఇలా చెప్తాడన్నమాట

  టైం అడిగితే ఇలా చెప్తాడన్నమాట

  జాకీ ష్రాఫ్ ని ఎవరైనా టైమ్ అడిగితే ఎలా చెప్తాడు అంటే ఈ ఫొటో చూపెట్టాలి. మొబైల్ లో , గడియారాలల్లో , వాచ్ లలో సమయం చూడటం ఓల్డ్ ప్యాషన్ ..ఇదిగో ఇలా టైమ్ అడిగితే చెప్పాలట.

  ఇలా పడిపోతున్న దాన్ని మనోడు

  ఇలా పడిపోతున్న దాన్ని మనోడు

  పడిపోతున్న పిజ్జా టవర్ ని మన హీరోగారు ఇలా తన కాలుతో ఆపుతారట. బాగుంది కదూ ఫీట్. నిజంగా ఏదన్నా సినిమాల్లో పెట్టేసినా పెట్టేస్తారు బాలీవుడ్ జనం. జాకీ ష్రాఫ్ మాత్రం ఈ ట్రోల్స్ చూసి మరి ఎలా నవ్వుకుంటున్నాడో.

  మన హీరో లోకల్ ట్రైన్ లో

  మన హీరో లోకల్ ట్రైన్ లో

  సాధారణంగా లోకల్ ట్రైన్ లో అందరూ ఇలా తమ చేతులతో పట్టుకుంటే.. మన హీరో మాత్రం తన కాలుతో ...ఇదీ కేక ట్రోల్. భలే ఐడియా వచ్చింది ఎవరికో కానీ.. ఓ ఫొటోతో ఇంత ఫన్ చేయివచ్చు అంటే నమ్మలేం.

  తాజ్ మహల్ దగ్గర మనోడు

  తాజ్ మహల్ దగ్గర మనోడు

  తాజ్ మహల్ దగ్గర అందరూ ఇలా ఫొటో దిగితే, మన హీరో మాత్రం ఇదిగో ఇలా డిఫెరెంట్ గా దిగుతాడట. ఇవన్నీ నవ్వుకోవటానికే కానీ నిజానికి టైగర్ మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ ని అందరూ మెచ్చుకుంటున్నారు ఈ రోజు.

  బ్యాట్ మెన్ అలా..మనోడు ఇలా..

  బ్యాట్ మెన్ అలా..మనోడు ఇలా..

  టైగర్ చూస్తూంటే బ్యాట్స్ మెన్ కూడా బీట్ చేసాలా ఉన్నాడే అంటున్నారు అభిమనులు. వరస పెట్టి అంతా ఇలాంటి ఫొటోలు కంటిన్యూగా పెడుతూనే ఉన్నారు. టైగర్ వీటినన్నటినీ చూస్తున్నాడో లేదో.

  ఇవన్నీ చేస్తాడు టైగర్

  ఇవన్నీ చేస్తాడు టైగర్

  టైగర్ ఓ ఫొటోనే ట్విట్టర్ లో పెట్టాడు కానీ మా ఉద్దేస్యంలో టైగర్ ఇవన్నీ చేయటానికి కేపబుల్ పర్శన్ . అతని మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ తో ఇదిగో ఇవన్ని చేసి అలరించగలరు అంటూ ఈ ఫొటో పెట్టాడో ఓ అభిమాని.

  టాయిలెట్ నుంచి బయిటకు

  టాయిలెట్ నుంచి బయిటకు

  ఈ జోక్ కాస్త క్రూడ్ గానే ఉంది, కానీ బాగా రెస్పాన్స్ వచ్చింది సోషల్ మీడియాలో . టాయిలెట్ నుంచి వచ్చేటప్పుడు చేతులు కడుక్కోకపోతే ఇదిగో ఇలా పలకరించుకోవచ్చు అన్నట్లు పెట్టారు. నవ్వొస్తే నవ్వుకోండి. లేకపోతే లైట్..

  ఇలాక్కూడా

  ఇలాక్కూడా

  ఈ ఫొటో గురించిప్రత్యేకంగా చెప్పేదేముంది. బాగా పరాకాష్టగా ఊహించి డిజైన్ చేసినట్లున్నాడు. కాకపోతే టైగర్ ష్రాఫ్ ఈ ట్రోల్స్ తోనే బాగా పాపులార్టీ వస్తోంది. గత రెండు రోజులుగా ట్రెండింగ్ లో ఉన్నాడు.

  మెట్లుతో సమానంగా

  మెట్లుతో సమానంగా

  టైగర్ ఇదిగో ఇలా ఇంత సామర్ధంతో మెట్లులా పైకి తన కాలు ఎత్తగలడన్నమాట. నిజానికి ఇంత ట్రోల్ చేస్తున్నారు కానీ ఇది చాలా కష్టమైన ఫీట్. కాలు అలా పైకి ఎత్తటం సామాన్యమైన విషయం అయితే మాత్రం కాదు.

  మరీ దారుణంగా...

  మరీ దారుణంగా...

  ట్రోల్ చేస్తున్నాం కదా అని మరీ అవధులు మీరి ట్రోల్ చేస్తున్న వ్యవహారంగా ఉంది. గైనకాలజిస్ట్ దగ్గరికి వెల్లినప్పుడు ఇలా అంటూ ఈ ఫొటోని పెట్టారు. కాస్త దారుణంగానే అనిపిస్తోంది కదూ. కానీ ఎవరిని ఎవరు సోషల్ మీడియాలో ఆపగలరు చెప్పండి.

  ఏం చెప్తాం. మీరే చూడండి

  ఏం చెప్తాం. మీరే చూడండి

  ఈ ఫొటో గురించి చెప్పటం కన్నా మీరు చదవటమే బెస్ట్. ఇంకా ఇలాంటివి చాలా ట్రోల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కానీ. ఇక్కడితో వాటికి ఫుల్ స్టాప్ పెడుతున్నాం. మరి మీరు ఇంతకీ నవ్వుకున్నారా.. మీరు వీటిని చూసిన తర్వాత ఏమనుకున్నారో క్రింద కామెంట్ల కాలంలో రాయండి మరి. మర్చిపోకండే.

  English summary
  Recently, Tiger Shroff posted a picture on his social media accounts and the poor actor ended up being trolled by Twitterati and we gotta agree that this time, it's way too hilarious!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X