రాంబో లుక్స్ స్టన్నింగ్. గ్యారెంటీగా వరల్డ్ క్లాస్ సినిమానే..

బాలీవుడ్ యువ నటుడు టైగర్ ష్రాఫ్ నటిస్తున్న రాంబో రీమేక్ చిత్రానికి ఎక్కడలేని ఆసక్తి పెరుగుతున్నది. గతనెల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయగానే అనూహ్య స్పందన లభించింది.

By Rajababu

బాలీవుడ్ యువ నటుడు టైగర్ ష్రాఫ్ నటిస్తున్న రాంబో రీమేక్ చిత్రానికి ఎక్కడలేని ఆసక్తి పెరుగుతున్నది. గతనెల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయగానే అనూహ్య స్పందన లభించింది. అచ్చు రాంబోలో సిల్వెస్టర్ స్టాలెన్ మాదిరిగా కనిపిస్తున్న టైగర్ ష్రాప్ లుక్ బ్రహ్మండమైన రెస్పాన్స్ వస్తున్నది. ఈ సినిమాపై దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ మంచి ధీమాతో ఉన్నారు. ఇటీవల మీడియాతో సిద్దార్థ్ ఆనంద్ మాట్లాడుతూ రాంబో రీమేక్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

రాంబో గ్లోబల్ ఐకాన్

రాంబో గ్లోబల్ ఐకాన్

రాంబో గ్లోబల్ ఐకాన్‌గా నిలిచిన చిత్రం. కేన్స్‌లో సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రారంభించగానే అనూహ్య స్పందన వచ్చింది. ప్రపంచ మీడియాతో మాట్లాడినప్పడు జర్నలిస్టుల నుంచి విశేష ఆదరణ కనిపించింది. ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడానికి చాలా ఉత్సాహం చూపారు అని సిద్దార్థ్ పేర్కొన్నారు.

ఇప్పటికీ కొత్త అనుభూతే

ఇప్పటికీ కొత్త అనుభూతే

రాంబో అనగానే ప్రపంచంలోని ప్రతీ ప్రేక్షకుడికి ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఆ సినిమాను ఇప్పటికి ఆదరించే ప్రేక్షకులు ఉన్నారు. రాంబో సినిమాను రీమేక్ చేసినా మళ్లీ విజయం సాధించే సత్తా ఆ కథలో ఉంది. యాక్షన్, ఎమోషన్స్ కలిసి ఉన్న వరల్డ్ క్లాస్ సినిమా అవుతుంది అని దర్శకుడు సిద్ధార్థ్ అభిప్రాయపడ్డారు.

రాంబోకు తగ్గని ఆదరణ

రాంబోకు తగ్గని ఆదరణ

రాంబో చిత్రానికి ఉన్న క్రేజ్ ఇప్పటికి తగ్గలేదు. అందుకే ఈ సినిమాకు మళ్లీ ఆదరణ ఉంటుంది. ఆ సినిమాలోని యాక్షన్ చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. మరోసారి రాంబో చిత్రం బాలీవుడ్‌లో మ్యాజిక్ చేస్తుంది అనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

మాజీ సైనికుడి పోరాటం..

మాజీ సైనికుడి పోరాటం..

వియత్నా యుద్ధంలో పోరాడిన జాన్ రాంబో అనే మాజీ సైనికుడి కథ. అమెరికా ఆర్మీ తరఫున స్పెషల్ ఫోర్సెస్ సోల్జర్ పాత్రను సిల్వెస్టర్ స్టాలెన్ పోషించాడు. ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. ప్రస్తుతం అదే కథను దేశీయ పరిస్థితులకు అనుకూలగా మార్చి టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సిద్దార్థ్.

దర్శకుడు ఇతనే..

దర్శకుడు ఇతనే..

హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ నటించిన బ్యాంగ్ బ్యాంగ్ చిత్రానికి ఈయన దర్శకత్వం వహించాడు. రాంబో రీమేక్ చిత్ర షూటింగ్ ఫిబ్రవరి 2018న సెట్స్ పైకి వెళ్లనున్నది. వచ్చే ఏడాది చివరిలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X