»   » సెమీ న్యూడ్‌గా సల్మాన్‌తో కత్రినా కైఫ్.. మాజీ ప్రియుడితో కలిసి మళ్లీ ఇలా..

సెమీ న్యూడ్‌గా సల్మాన్‌తో కత్రినా కైఫ్.. మాజీ ప్రియుడితో కలిసి మళ్లీ ఇలా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో కత్రినా కైఫ్ జత కలిసింది. టైగర్ జిందా హై షూటింగ్‌లో మాజీ ప్రియుడితో కలిసి సరదాగా గడిపింది. సల్మాన్‌తో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఇలా దర్శనమివ్వడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

అన్యోన్యంగా..

అన్యోన్యంగా..

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న టైగర్ జిందా హై చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ షూటింగ్ సందర్భంగా వారిద్దరు అన్యోన్యంగా ఉన్నారని, మళ్లీ ప్రేమపక్షుల్లా విహరించారని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం పోస్ట్ చేసిన ఈ ఫోటోకు ఇంటర్నెట్‌లో విశేష స్పందన వస్తున్నది.

సెమీ న్యూడ్‌గా..

సెమీ న్యూడ్‌గా..

ఈ ఫోటోలో సల్మాన్‌కు శరీరంపై షర్ట్ లేదు. కేవలం షార్ట్ మాత్రమే ధరించాడు. కత్రినా పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఈ ఫోటోపై పలువురు నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. వారి మధ్య కెమిస్ట్రీ బాగా ఉందనే కామెంట్లు పెట్టారు.

ఏక్ థా టైగర్‌కు సీక్వెల్‌గా..

ఏక్ థా టైగర్‌కు సీక్వెల్‌గా..

సల్మాన్ ఖాన్, కత్రినా నటిస్తున్న టైగర్ జిందా హై చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏక్ థా టైగర్ సినిమాకు సీక్వెల్‌గా యష్‌రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్నది. ఈ చిత్రమేకాకుండా అనురాగ్ బసు దర్శకత్వంలో వస్తున్న జగ్గా జాసూస్ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌ పక్కన నటిచింది.

ప్రభాస్‌తో జంటగా...

ప్రభాస్‌తో జంటగా...

ఇదిలా ఉండగా, బాహుబలి2 తర్వాత ప్రభాస్‌ నటించబోయే చిత్రంలో కత్రినా కైఫ్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వెలువడుతున్నాయి. డేట్స్, తదితర అంశాలపై కత్రినాతో సంప్రదింపులు జరుపుతున్నట్టు జాతీయ మీడియా వెల్లడించింది.

English summary
Salman Khan is seen wearing shorts and donning a weird hairpiece in the photo that also has Katrina Kaif. The two actors are working together on their next, Tiger Zinda Hai. Katrina is also awaiting the release of Anurag Basu’s Jagga Jasoos, alongside Ranbir Kapoor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu