దెబ్బ తిన్న పులిని ఎవరూ వేటాడలేరు.. సల్మాన్.. ఇరుగదీసిన ఫస్ట్‌లుక్
దీపావళి పండుగను పురస్కరించుకొని టైగర్ జిందా హై సినిమా ఫస్ట్ లుక్‌ను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ట్విట్టర్‌లో రిలీజ్ చేశాడు. ఏక్ థా టైగర్ చిత్రంలో సీక్రెట్ ఏజెంట్ గా కనిపించిన సంగతి తెలిసింద
దీపావళి పండుగను పురస్కరించుకొని టైగర్ జిందా హై సినిమా ఫస్ట్ లుక్‌ను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ట్విట్టర్‌లో రిలీజ్ చేశాడు. ఏక్ థా టైగర్ చిత్రంలో సీక్రెట్ ఏజెంట్ గా కనిపించిన సంగతి తెలిసిందే. ట్యూబ్ లైట్ చిత్రం ఘోర పరాజయం పొందిన తర్వాత వస్తున్న ఈ సల్మాన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సల్మాన్ గన్ పట్టుకొని
అక్టోబర్ 18న రిలీజ్ చేసిన పస్ట్ లుక్‌లో సల్మాన్ గన్ పట్టుకొని సీరియస్‌గా చూస్తున్న స్టిల్‌ను తన ట్విట్టర్ అకౌంట్‌లో రిలీజ్ చేశాడు. ఫొటోతోపాటు దెబ్బతిన్న పులిని ఎవ్వరూ వేటాడలేరు' అని కాప్షన్‌ను సల్మాన్ పెట్టడం గమనార్హం.
క్రిస్‌మస్‌కు మళ్లీ కలుద్దాం
దీపావళి కానుకగా ఇచ్చిన ఫస్ట్ లుక్ నచ్చిందా.. క్రిస్‌మస్‌కు మళ్లీ కలుద్దాం అంటూ ట్విట్ చేశాడు.. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానున్నది.

సల్మాన్ కెరీర్‌లోనే చెత్త
సల్మాన్ గత చిత్రం ట్యూబ్ లైట్ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఈ మధ్యకాలంలో సల్మాన్ కెరీర్‌లోనే అత్యంత చెత్త చిత్రమనే అపవాదును మూటగట్టుకొన్నది. ఈ నేపథ్యంలో టైగర్ జిందా హై చిత్రంపై మరింత ఆసక్తి నెలకొన్నది.

టైగర్ జిందా హైతో సల్మాన్ ఖాన్
ఈ నేపథ్యంలో ఏక్ థా టైగర్ సీక్వెల్‌గా వస్తున్న టైగర్ జిందా హైతో సల్మాన్ ఖాన్ మరో హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించనున్నాడు.
సల్మాన్‌కు సూపర్ హిట్ జోడి కత్రినా కైఫ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











