Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
భారీ కలెక్షన్లతో మూడోవారంలోకి టిక్ టిక్ టిక్!
భారీ బడ్జెట్ చిత్రాలు, స్ట్రయిట్ సినిమాలే రెండు వారాలపాటు థియేటర్లలో ప్రదర్శితమవ్వడానికి నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఒక డబ్బింగ్ సినిమాగా విడుదలైన "టిక్ టిక్ టిక్" బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకొన్నది. కమర్షియల్ సినిమా కాకపోయినా.. మాస్ ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేసే స్పెషల్ సాంగ్స్, ఫైట్స్ ఏమీ లేకపోయినా.. కంటెంట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటూ మూడోవారంలోకి అడుగిడింది.
జయం రవి-నివేతా పెతురాజ్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళ-తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కాగా రెండు చోట్ల సూపర్ హిట్ టాక్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తూ నేటితో మూడోవారంలోకి అడుగిడింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చదలవాడ లక్ష్మణ్ మాట్లాడుతూ.."ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారుతోంది. కమర్షియల్ అంశాలకంటే కంటెంట్‌కి ఎక్కువ విలువ ఇస్తున్నారు. అందుకే మా "టిక్ టిక్ టిక్"ను విశేషమైన రీతిలో ఆదరిస్తూ మంచి విజయాన్ని అందించారు. పెద్దలతోపాటు పిల్లలు కూడా మా చిత్రాన్ని ఆదరిస్తుండడం చాలా సంతోషంగా ఉంది.
మేం ఉహించినదానికంటే భారీ స్థాయిలో కలెక్షన్స్ ఉన్నాయి. ఇదే తరహాలో వైవిధ్యమైన చిత్రాలు మా సంస్థ నుంచి వస్తూనే ఉంటాయి. ప్రేక్షకులకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే చూడాలని కోరుకొంటున్నామని లక్ష్మణ్ పేర్కొన్నారు.