twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారీ కలెక్షన్లతో మూడోవారంలోకి టిక్ టిక్ టిక్!

    By Rajababu
    |

    భారీ బడ్జెట్ చిత్రాలు, స్ట్రయిట్ సినిమాలే రెండు వారాలపాటు థియేటర్లలో ప్రదర్శితమవ్వడానికి నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఒక డబ్బింగ్ సినిమాగా విడుదలైన "టిక్ టిక్ టిక్" బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకొన్నది. కమర్షియల్ సినిమా కాకపోయినా.. మాస్ ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేసే స్పెషల్ సాంగ్స్, ఫైట్స్ ఏమీ లేకపోయినా.. కంటెంట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటూ మూడోవారంలోకి అడుగిడింది.

    జయం రవి-నివేతా పెతురాజ్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళ-తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కాగా రెండు చోట్ల సూపర్ హిట్ టాక్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తూ నేటితో మూడోవారంలోకి అడుగిడింది.

    Tik Tik Tik is entered into third week

    ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చదలవాడ లక్ష్మణ్ మాట్లాడుతూ.."ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారుతోంది. కమర్షియల్ అంశాలకంటే కంటెంట్‌కి ఎక్కువ విలువ ఇస్తున్నారు. అందుకే మా "టిక్ టిక్ టిక్"ను విశేషమైన రీతిలో ఆదరిస్తూ మంచి విజయాన్ని అందించారు. పెద్దలతోపాటు పిల్లలు కూడా మా చిత్రాన్ని ఆదరిస్తుండడం చాలా సంతోషంగా ఉంది.

    మేం ఉహించినదానికంటే భారీ స్థాయిలో కలెక్షన్స్ ఉన్నాయి. ఇదే తరహాలో వైవిధ్యమైన చిత్రాలు మా సంస్థ నుంచి వస్తూనే ఉంటాయి. ప్రేక్షకులకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే చూడాలని కోరుకొంటున్నామని లక్ష్మణ్ పేర్కొన్నారు.

    English summary
    Tik Tik Tik is an Tamil science fiction thriller film written and directed by Shakti Soundar Rajan. The film has been promoted as India's first space film. The film features Jayam Ravi, Aaron Aziz, and Nivetha Pethuraj in the lead roles. The venture began production in October 2016. The film was initially scheduled to be released on January 26, 2018, but was postponed. It released on June 22, 2018. This movie is running successfully and entered into third week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X