జూన్ 22న ‘టిక్ టిక్ టిక్’... సౌత్‌లో ఇదే తొలి అంతరిక్ష చిత్రం
స్పేస్ షిప్, ఉల్కా పాతం, అంతరిక్షం లాంటి సైన్స్ ఫిక్షన్స్ సినిమాలు అంటే హాలీవుడ్ ఇండస్ట్రీ గుర్తుకు వస్తుంది. ఇలాంటి వాటిలో గ్రాఫిక్స్ కీలకం, భారీ బడ్జెట్ ఖర్చవుతుంది. ఇలాంటివి హాలీవుడ్లోనే సాధ్యం అనేది చాలా మంది అభిప్రాయం. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఇండియన్ సినిమా పరిశ్రమలో.... అందులోనూ సౌత్‌లో స్పేస్ షిప్, ఉల్కా పాతం, అంతరిక్షం లాంటి కాన్సెప్టుతో సినిమా రాబోతోంది.
'టిక్ టిక్ టిక్' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం తమిళంలో పాటు తెలుగులోనూ విడుదల కాబోతోంది. జయం రవి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సౌందర్ రాజన్ దర్శకత్వం వహించారు. భారత సినీ చరిత్రలో తొలి అంతరిక్ష సినిమాగా దీన్ని తెరకెక్కిస్తుండటం విశేషం.
ఈ చిత్రాన్ని 'నెమిచంద్ ఝబక్' అనే సంస్థ నిర్మిస్తోంది. ప్రముఖ తమిళ సినీ నిర్మాణ సంస్థ థెనాండల్ ఫిల్మ్స్ వారి సమర్పణలో విడుదలవుతోంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ వారు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఇటీవల విడుదలైన ట్రైలర్లో గ్రాఫిక్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ట్రైలర్‌లో విశాఖపట్నంపై ఉల్క దాడిచేసినట్లు చూపించారు. విశాఖకు మరో ఉల్క దాడి చేసే ముప్పు ఉందని ఈ ఉల్క ఇండియా మ్యాప్‌నే మార్చేస్తుందని ట్రైలర్‌లో వ్యోమగాములు చర్చించుకుంటుండం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. జూన్ 22న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











