‘టిక్ టిక్ టిక్’ ట్రైలర్ చూశారా? ఇండియన్ తొలి అంతరిక్ష చిత్రం...గ్రేట్!
Recommended Video

స్పేస్ షిప్, ఉల్కా పాతం, అంతరిక్షం సైన్స్ ఫిక్షన్స్ అంటే హాలీవుడ్ సినిమాలే.... అలాంటి సినిమాలు చేసే టాలెంట్ అక్కడి వారికే ఉంది, అంత భారీ బడ్జెట్‌తో హాలీవుడ్లోనే ఆ సినిమాలు సాధ్యం అనేది చాలా మంది అభిప్రాయం. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఇండియన్ సినిమా పరిశ్రమలో.... అందులోనూ సౌత్‌లో స్పేస్ షిప్, ఉల్కా పాతం, అంతరిక్షం లాంటి కాన్సెప్టుతో సినిమా రాబోతోంది. తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులోనూ విడుదలవ్వబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా విడుదలైంది.

టిక్ టిక్ టిక్
జయం రవి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘టిక్:టిక్:టిక్'. సౌందర్ రాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. భారత సినీ చరిత్రలో తొలి అంతరిక్ష సినిమాగా దీన్ని తెరకెక్కిస్తుండటం విశేషం.

భారీగా బడ్జెట్
ఈ చిత్రాన్ని ‘నెమిచంద్ ఝబక్' అనే సంస్థ నిర్మిస్తోంది. ప్రముఖ తమిళ సినీ నిర్మాణ సంస్థ థెనాండల్ ఫిల్మ్స్ వారి సమర్పణలో విడుదలవుతోంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ వారు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఆకట్టుకుంటున్న గ్రాఫిక్స్
తాజాగా విడుదలైన ట్రైలర్లో గ్రాఫిక్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ట్రైలర్‌లో విశాఖపట్నంపై ఉల్క దాడిచేసినట్లు చూపించారు. విశాఖకు మరో ఉల్క దాడి చేసే ముప్పు ఉందని ఈ ఉల్క ఇండియా మ్యాప్‌నే మార్చేస్తుందని ట్రైలర్‌లో వ్యోమగాములు చర్చించుకుంటుండం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
రిలీజ్ ఎప్పుడు?
తెలుగు, తమిళంలో ఈ సినిమా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతరిక్షం నేపథ్యంలో వస్తున్న తొలి ఇండియన్ సినిమా కావడం, ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.


Click it and Unblock the Notifications











