twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ ‘తిలక్’ను తిప్పికొట్టిన నిర్మాత

    By Bojja Kumar
    |

    హీరో పవన్ కళ్యాణ్-దర్శకుడు విష్ణు వర్ధన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు 'తిలక్" అనే టైటిల్ ఖరారు చేసినట్లు వస్తున్న వార్తలను ఆ సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ తోసిపుచ్చారు. తిలక్ అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు కొన్ని మీడియా వెబ్ సైట్లలో పేర్కొనడాన్ని ఆయన ఖండించారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.

    ప్రస్తుతం ఈ సినిమా వర్కింగ్ టైటిల్‌గా షాడో గా ఉంది. దీన్నే కొందరు కాళీ అంటున్నారు. ఎవరి ప్రచారం ఎలా ఉన్నా అక్టోబర్‌లో దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. అప్పటి వరకు ఎలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆర్.ఎఫ్.సి, హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన సారా జాన్ డియాస్, అంజనా లవానియాలు నటిస్తుండగా, అడవి శేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను...ఆర్కా మీడియా, సంఘమిత్ర ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    English summary
    Power Star Pawan Kalyan’s film in the direction of Vishnuvardhan has been titled as Tilak and few media sites had come up with this news. But Producer Shobu Yarlagadda has confirmed that they have never considered Tilak as the title.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X