నితిన్ సినిమా ట్రైలర్ లాంచ్ చేయనున్న సూపర్ స్టార్ మహేష్.. ముహూర్తం ఫిక్స్!
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం శ్రీనివాస కళ్యాణం. 15 ఏళ్ల గ్యాప్ తరువాత నితిన్, దిల్ రాజు కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ఇది. తెలుగువారి సాంప్రదాయ వివాహాలకు అద్దం పట్టేలా పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా శ్రీనివాస కళ్యాణం రాబోతోంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 9 న విడుదల చేయబోతున్నారు.
నితిన్, రాశి ఖన్నా జంటగా నటించారు. నందిత స్వేత కీలక పాత్రలో నటిస్తోంది. ప్రకాష్ రాజ్, జయసుధ, నరేష్, రాజేంద్ర ప్రసాద్, ఆమని తోపాటు 70 మంది ప్రధాన తారాగణం ఈ చిత్రంలో నటించడం విశేషం. శతమానం భవతి తరువాత దర్శకుడు సతీష్ వేగేశ్న నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉండగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా శ్రీనివాస కళ్యాణం ట్రైలర్ విడుదల కానుండడం విశేషం. ఆగష్టు 2 సాయంత్రం 5:30 గంటలకు మహేష్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.


Click it and Unblock the Notifications











