ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌కి టైం ఫిక్స్.. అంచనాలు పెంచేసిన హారిక అండ్ హాసిని!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. దసరాకు విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ఇప్పటి నుంచే భారీగా అంచనాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం జైలవకుశ. త్రివిక్రమ్ చిత్రంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నాడు.
ఆదివారం రోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా శనివారం రోజు ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది. తాజగా ఫస్ట్ లుక్ విడుదుల చేసే టైం కూడా ఫిక్స్ చేసారు. శనివారం సాయంత్రం 4: 50 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు. అత్యంత ఆసక్తి రేపుతున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పై హారిక అండ్ హాసిని సంస్థ ఇంకా అంచనాలు పెంచేసింది.

ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతోందంటూ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.


Click it and Unblock the Notifications











