కాసుకోండి... కాజల్‌ డబుల్‌ ధమాకా

By Srikanya

హైదరాబాద్ : కాజల్‌ ఇద్దరు హీరోలతో కలిసి హిట్‌ పెయిర్‌గా నిలుస్తోంది. పరిచయం కోలీవుడ్‌లోనే జరిగినా... హవా మాత్రం టాలీవుడ్‌లో కొనసాగించింది కాజల్‌. ఆమె కెరీర్‌కు తమిళంలోనూ బలమైన పునాది వేసిన చిత్రం 'నాన్‌ మహాన్‌ అల్ల'(నా పేరు శివ). ఇందులో ఆమె కార్తీకి జంటగా నటించింది. జంట పరంగా కూడా మంచి పేరు వీరికి దక్కింది. ఈ చిత్ర ఫలితంతో ఈ జోడీపై అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల నడుమ 'ఆల్‌ ఇన్‌ ఆల్‌ అళగురాజా'తో మరోసారి ప్రేక్షకుల చెంతకొస్తున్నారు. గతంతో పోలిస్తే మరింత కనువిందు చేస్తున్న ఈ జోడీ కూడా దీపావళి రేసులో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది.

రోబో తర్వాత కోలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'తుప్పాక్కి' పేరు సంపాదించింది. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా యాక్షన్‌ సన్నివేశాల్లో మెరిసిన విజయ్‌... తనతో తొలిసారి జంటగా నటించిన కాజల్‌ అగర్వాల్‌తో చక్కని జోడీగా కనువిందు చేశాడు. వీరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను, విమర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవల కాలంలో భారీ హిట్‌లకు దూరంగా ఉన్న విజయ్‌కు తుప్పాక్కి అతిపెద్ద విజయంగా నమోదు కావటంతో ఈ జోడీ ప్రత్యేకత సంపాదించింది. కొత్త చిత్రంలో వీరిద్దరు మళ్లీ నటించనున్నారు. ఆ చిత్రమే 'జిల్లా'. కొత్త దర్శకుడు నేశన్‌ తెరకెక్కిస్తుండగా, ఆర్‌బీ చౌదరి నిర్మిస్తున్నారు. అంచనాల నడుమ పొంగల్‌ కానుకగా ప్రేక్షకుల చెంతకు రానుంది.

ఈ రెండు చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అవనున్నాయి. తద్వారా ఇక్కడ ఆమె కనపడని లోటు తీరుతుందని ఆమె ఆశపడుతోంది. 'స్పెషల్‌ ఛబ్బీస్‌', 'తుపాకీ' చిత్రాల్లో పోషించిన పాత్రలు కాజల్‌కి చాలా నచ్చాయట. ఇప్పుడు 'జిల్లా' అనే తమిళ చిత్రంలో కాజల్‌ పోలీసుగా నటిస్తోంది. అలాగే ...''నటిగా రకరకాల పాత్రలు పోషించాల్సి ఉంటుందని నాకు తెలుసు. అయితే ఇటీవల లభిస్తున్న పాత్రల్ని మాత్రం ఊహించలేదు. 'స్పెషల్‌ ఛబ్బీస్‌'లో ఉపాధ్యాయురాలిగా, 'తుపాకీ'లో బాక్సర్‌గా నటిస్తున్నప్పుడు ఎంతగా ఆనందం కలిగిందో మాటల్లో చెప్పలేను. ఇప్పుడు 'జిల్లా'లో పోషిస్తున్న పోలీసు పాత్ర కూడా అదే తరహా అనుభవాన్నిస్తోంది.'' అంది కాజల్.

'జిల్లా' సినిమా వివరాల్లోకి వెళితే ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో విజయ్, మోహన్ లాల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్.టి.నీసన్ దర్శకత్వం వహిస్తుండగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బేనర్‌పై ఆర్.బి. చౌదరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2014లో సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు కాజల్ 'ఆల్ ఇన్ ఆల్ అఝగు రాజా' అనే మరో తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది. స్టూడియోగ్రీప్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈచిత్రంలో కార్తీ హీరో. ఎం.రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X