»   » మహేష్ బాబును వెనక్కి నెట్టి నెం.1 స్థానంలోకి రానా

మహేష్ బాబును వెనక్కి నెట్టి నెం.1 స్థానంలోకి రానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో రానా మహేష్ బాబును వెనక్కి నెట్టి నెం.1 పొజిషన్ దక్కించుకున్నాడు. అయితే ఇది సినిమాల విషయంలో మాత్రం కాదు. టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్-2014 జాబితాలో రానా నెం.1 స్థానం దక్కించుకున్నాడు. సామాన్య ప్రజల నుండి ఓపీనియన్ పోల్ నిర్వహించడం ద్వారా ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.

తమిళ, మళయాలం హీరోలు అజిత్, దుల్క్ సల్మాన్ కూడా ఈ లిస్టులో టాప్ పొజిషన్ అందుకున్నారు. తెలుగులో రానా, మహేష్ బాబు తర్వాతి స్థానాల్లో ప్రభాస్, నితిన్, ఎన్టీఆర్, అఖిల్ వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాలు దక్కించుకున్నారు. ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 7వ స్థానం, హైదరాబాద్ బాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ 8వ స్థానంలో నిలిచాడు.

Times Most Desired Men: Rana Beats Mahesh Babu

ఇక 9వ స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, 10వ స్థానంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిలిచారు. అక్కినేని స్టార్లు నాగ చైతన్య, నాగార్జున 11, 12 స్థానాలు దక్కించుకున్నారు. గతేడాది ఈ లిస్టులో నెం.1 స్థానంలో ఉన్న మహేష్ బాబును ఇపుడు రానా బీట్ చేయడం హాట్ టాపిక్ అయింది.

English summary
The tall and macho Rana Daggubati has surpassed Superstar Mahesh Babu to grab the number one spot in the Times Most Desired Men list for the year 2014.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu