twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'తారే జమీన్ పర్' కి పోటీగా ఆస్కార్ కి టింగ్యా!

    By Staff
    |

    Tingya
    మన దేశం తరఫున ఆస్కార్‌ పురస్కారాల విదేశీ భాషా చిత్ర విభాగానికి అమీర్‌ ఖాన్‌ చిత్రం 'తారే జమీన్‌ పర్‌'ను భారత చిత్ర సమాఖ్య(ఎఫ్‌ఎఫ్‌ఐ) అధికారికంగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ మరాఠీ చిత్రం 'టింగ్యా' ను స్వతంత్ర ఎంట్రీగా పంపనున్నట్లు ...తాను స్వతంత్రంగా దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆదివారం ఆ చిత్ర నిర్మాత రవి రాయ్‌ తెలిపారు. తనకు ఎఫ్‌ఎఫ్‌ఐ లేదా అమీర్‌పై ఎలాంటి వ్యతిరేకత లేదని రాయ్‌అన్నారు.

    ''వ్యక్తిగతంగా తారే జమీన్‌ పర్‌ చిత్రమంటే నాకిష్టం. ఎందుకంటే పిల్లలకు సంబంధించిన అంశంపై చిత్రాన్ని తీయడానికి అమీర్‌ఖాన్‌ లాంటి అగ్ర నటుడు సాహసించారు. అదే సమయంలో టింగ్యా కూడా చాలా మంచి సినిమా'' అని ఆయన వ్యాఖ్యానించారు. సాంకేతికంగా ఉన్నతంగా ఉండటం వల్లే తారే జమీన్‌ పర్‌ను కమిటీ ఎంపిక చేసిందన్నారు. అయితే తన ఉద్దేశం ప్రకారం చిత్రం ఆత్మ అన్నింటికంటే ముఖ్యమైనదని చెప్పారు. ఐదు అంతర్జాతీయ పురస్కారాలు సహా మొత్తం 37 అవార్డులను తమ చిత్రం గెలుచుకుందని చెప్పారు.

    ''ముంబయి అంతర్జాతీయ చిత్రోత్సవంలో తారే జమీన్‌ పర్‌ చిత్రం ఉన్నా జ్యూరీ సభ్యులు క్రిటిక్స్‌ పురస్కారాన్ని మా సినిమాకు ఇచ్చారు. ఆస్కార్‌ కమిటీ కూడా అదే విధంగా భావిస్తుందేమో ఎవరు చెప్పగలం'' అని అన్నారు. మహారాష్ట్ర వ్యవసాయ సంక్షోభం నేపథ్యంగా తీసుకుని నిర్మించిన ఈ చిత్రంలో తమ ఇంట్లోని ఎద్దు పట్ల ఆరేళ్ల బాలుడు పెంచుకున్న ప్రేమాభిమానాలను హృద్యంగా చిత్రించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X