twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రివ్యూ ఎఫెక్టు : 'ఆంధ్రజ్యోతి ఫైర్ అయిన హీరో

    By Srikanya
    |

    హైదరాబాద్: సినిమా రివ్యూలలో నిజాయితీ ఉందా...లేదా అనేది ప్రక్కన పెడితే నెగిటివ్ గా సమీక్ష ఉన్నప్పుడు ఆ చిత్రం హీరో, దర్సక,నిర్మాతలు ఫైర్ అవటం సామాన్యంగా జరిగే విషయమే. అయితే వారు తమ ఆఫీసుల్లోనో, మరోచోటో తిట్టుకుంటూ ఉంటూంటారు. కానీ ఈ సారి...ఓ కొత్త హీరో... ఓ తెలుగు న్యూస్ పేపరుపై ధ్వజం ఎత్తారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    మొన్న శుక్రవారం విడుదలైన టిప్పు చిత్రం గురించి తుప్పు అనే పేరుతో ఆంధ్రజ్యోతి పేపరులో రివ్యూ వచ్చింది. అయితే ఇప్పుడు హఠాత్తుగా ఈ రివ్యూ చర్చనీయాంశం అయ్యింది. దానికి కారణం ...ఈ చిత్రం హీరో కార్తీక్... ఓ వెబ్ సైట్ సాక్షిగా ఈ పేపరుని, రివ్యూని ప్రశ్నించాడు.

    Tippu Hero questioned Andhara Jyothi

    ఆయన రివ్యూ రాసిన తీరుని తప్పు పడుతూ..... సినిమా రంగంపై ఆసక్తితో వచ్చే కొత్తవాళ్లని కాస్తయినా ప్రోత్సహించాలని, అలాకాకుండా ఇలా నిలదీయడం సరికాదని ఆయన అన్నారు. మీరు సినిమా తీసి, దానిపై ఇలా సమీక్ష వస్తే మీరు ఎలా ఫీలవుతారు అంటూ కొంచెం ఘాటుగానే నిలదీసారు.

    అలాగే....తన నటన, వాచకం, విషయాల్లో మంచి రిమార్కులే వచ్చాయని, అందరూ తన నటన, వాచకం విషయంలో బాగానే చేసాడని రాసారని, కానీ ఆంధ్ర జ్యోతి మాత్రం తనది స్టోన్ ఫేస్ అని డైలాగులు చెప్పలేకపోయాడని పేర్కొన్నారని, అదే బాధ అనిపించిందని కార్తీక్ పేర్కోన్నారు.

    తనది స్టోన్ ఫేస్ నా కాదా, సినిమాలో బాగా చేసానా లేదా అన్నది మీడియా జనాలే సినిమా చూసి చెప్పాలని అన్నారు. స్టోన్ ఫేస్ అని, బాగా చేయలేదని రాస్తే, ఏ అప్ కమింగ్ హీరోతో అయినా మళ్లీ సినిమా చేయడానికి ఇంకెవరు ముందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు.

    మరో ప్రక్క విడుదలకు ముందు రోజు రాత్రి 7.10 నిమషాలకు రవివర్మ (ట్రూకాలర్ ప్రకారం) అనే వ్యక్తి కాల్ చేసారని, ఎత్తకపోతే, మెసేజ్ పెట్టారని దర్శకుడు దానేటి వెల్లడించారు.

    Tippu Hero questioned Andhara Jyothi

    దాంతో 7.30కి మాట్లాడారని, చౌదరి అనే వ్యక్తి మాట్లాడుతూ ఆంధ్ర జ్యోతికి 11 లోపు ప్రకటనలు ఇస్తే సరి అని లేదంటే నెగిటివ్ సమీక్ష రాస్తామని చెప్పారట. మెసేజ్ ప్రూఫ్, కాల్ ప్రూఫ్ అన్నీ వున్నాయన్నారు.

    సినిమా విషయానికి వస్తే...

    గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పంపిణిదారుడిగా పనిచేసిన అనుభవమున్న డి.వి. సీతారామరాజు, తన కుమారుడు సాయి కార్తీక్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన సినిమాయే ‘టిప్పు'. కనికా కపూర్, ఫమేలా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ద్వారా జగదీష్ దర్శకుడిగా పరిచయం అయ్యారు.

    కార్తిక్ కృష్ణ గురించి ఆ రివ్యూలో ఏమి రాసారంటే...

    కార్తీక్‌కృష్ణ పాత్రలో జీరో ఇమేజ్‌ ఉన్న సత్యకార్తీక్‌ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. అతని ఆహార్యం, వాచకం, శరీరభాష.. ఏదీ.. ‘హీరో' అనిపించుకునే స్థాయిలో లేదు. సబ్జెక్టుని మోసే కేరక్టర్‌ ఎంత గ్రేస్‌ఫుల్‌గా ఉండాలి! ఆ గ్రేస్‌ బొత్తిగా అతడిలో కనిపించలేదు. అభినయం విషయంలో అతను చాలా నేర్చుకోవాలని బాల ప్రేక్షకులు కూడా ఇట్టే గ్రహించేస్తారు. అతడి డాన్సుల్లోనూ ఈజ్‌, రిథమ్‌ కనిపించవు.

    English summary
    Telugu Movie Tippu hero fired on Andhrajyothy news paper review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X