Don't Miss!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
హవ్వ...! శ్రీవారిని లవర్ బాయంటోన్న హీరోయిన్
తిరుమల శ్రీవారే నా లవర్ బాయ్ అంటూ....సినీ నటి కామ్న జెఠ్మలానీ వ్యాఖ్యానించింది. శ్రీవారి దర్శనార్థం బుధవారం తిరుమల వచ్చిన ఆవిడ ఆలయం బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడుతూ....మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
శ్రీవారి దర్శనం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, తిరుమల క్షేత్రం, ఇక్కడ లభించే శ్రీవారి లడ్డూ ఎంతో అద్భుతమని చెప్పుకొచ్చింది. ఆ సంగతి పక్కన పెడితే ఆమె ఒకే టిక్కెట్‌పై రెండు సార్లు దర్శనం చేసుకుందని కొందరు భక్తులు ఆరోపించారు. అయితే అలాంటిదేమీ లేదని అధికారులు తేల్చి చెప్పారు.
హీరోయిన్ కామ్నా జఠ్మలానీ ఈ మధ్య తెలుగు తెరపై అసలు కనిపించడమే లేదు. అమ్మడు తెలుగులో దాదాపు అరడజను పైనే సినిమాల్లో నటించింది.అందులో ఎక్కువ సినిమాలు కామెడీ స్టార్ అల్లరి నరేష్ తోనే చేసింది. అయితే ఈ సినిమాల వల్ల అల్లరి నరేష్ కెరీర్ గ్రాఫ్ పెరిగిందే తప్ప కామ్నాకు కలిసొచ్చిందేమీ లేదు. మెల్లి మెల్లిగా ఆమె చేతిలో అవకాశాలు లేకుండా పోయాయి. ఇక హీరోయిన్ అవకాశాల కోసం ట్రై చేసి లాభం లేదనుకున్న అమ్మడు కామ్ గా ఉంటూ మరో రూట్ లోకి దిగింది.
ఈ మధ్య తరచూ కామ్నా అమెరికా టు ఇండియా, ఇండియా టు అమెరికా చెక్కర్లు కొడుతోంది. పైకి అక్కడ ఎన్ఆర్ఐలు నిర్వహించే కార్య్రకమాల్లో స్టేట్ షోలు ఇవ్వడానికి అన్నట్లు కనిపిస్తున్నా, తెర వెనక మరో... వ్యవహారం నడిపిస్తూ ఫుల్లగా సంపాదిస్తుందనే పుకార్లు వినిపిస్తున్నాయి.