twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హవ్వ...! శ్రీవారిని లవర్ బాయంటోన్న హీరోయిన్

    By Bojja Kumar
    |

    తిరుమల శ్రీవారే నా లవర్ బాయ్ అంటూ....సినీ నటి కామ్న జెఠ్మలానీ వ్యాఖ్యానించింది. శ్రీవారి దర్శనార్థం బుధవారం తిరుమల వచ్చిన ఆవిడ ఆలయం బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడుతూ....మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

    శ్రీవారి దర్శనం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, తిరుమల క్షేత్రం, ఇక్కడ లభించే శ్రీవారి లడ్డూ ఎంతో అద్భుతమని చెప్పుకొచ్చింది. ఆ సంగతి పక్కన పెడితే ఆమె ఒకే టిక్కెట్‌పై రెండు సార్లు దర్శనం చేసుకుందని కొందరు భక్తులు ఆరోపించారు. అయితే అలాంటిదేమీ లేదని అధికారులు తేల్చి చెప్పారు.

    హీరోయిన్ కామ్నా జఠ్మలానీ ఈ మధ్య తెలుగు తెరపై అసలు కనిపించడమే లేదు. అమ్మడు తెలుగులో దాదాపు అరడజను పైనే సినిమాల్లో నటించింది.అందులో ఎక్కువ సినిమాలు కామెడీ స్టార్ అల్లరి నరేష్ తోనే చేసింది. అయితే ఈ సినిమాల వల్ల అల్లరి నరేష్ కెరీర్ గ్రాఫ్ పెరిగిందే తప్ప కామ్నాకు కలిసొచ్చిందేమీ లేదు. మెల్లి మెల్లిగా ఆమె చేతిలో అవకాశాలు లేకుండా పోయాయి. ఇక హీరోయిన్ అవకాశాల కోసం ట్రై చేసి లాభం లేదనుకున్న అమ్మడు కామ్ గా ఉంటూ మరో రూట్ లోకి దిగింది.

    ఈ మధ్య తరచూ కామ్నా అమెరికా టు ఇండియా, ఇండియా టు అమెరికా చెక్కర్లు కొడుతోంది. పైకి అక్కడ ఎన్ఆర్ఐలు నిర్వహించే కార్య్రకమాల్లో స్టేట్ షోలు ఇవ్వడానికి అన్నట్లు కనిపిస్తున్నా, తెర వెనక మరో... వ్యవహారం నడిపిస్తూ ఫుల్లగా సంపాదిస్తుందనే పుకార్లు వినిపిస్తున్నాయి.

    English summary
    Actress Kamna Jethmalani visited Tirumala on wednesday. 'Tirumala Srinivasa is my boyfriend' She says. Kamna Jethmalani is facing a huge problem in the Tollywood film industry. Recently several rumors rounded in internet that this actress married some person which covered entire Tollywood arena like a forest fire.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X