‘బిగ్ బాస్’ హరితేజ ఓవర్ యాక్టింగ్... శివారెడ్డితో కలిసి రచ్చ రచ్చ!

ఇటీవల తిరుపతిలో జరిగిన దీపావళి ఉత్సవం 2017 కార్యక్రమాన్ని హరితేజ, శివా రెడ్డి హెస్ట్ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో వీరి ప్రవర్తన అంత బాగోలేదని, కాస్త వల్గర్ గా ఉందనే విమర్శలు వస్తున్నాయి.

By Bojja Kumar

Recommended Video

‘బిగ్ బాస్’ హరితేజ ఓవర్ యాక్టింగ్... శివారెడ్డితో కలిసి రచ్చ రచ్చ!

'బిగ్ బాస్' షో తర్వాత నటి హరితేజ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ షో కంటే ముందు ఆమె పలు చిత్రాల్లో నటించినా అంతగా పాపులారిటీ రాలేదు. బిగ్ బాస్ తర్వాత హరితేజ దశ తిరిగింది. సినిమా అవకాశాలతో పాటు.... సినీ పరిశ్రమ బయట జరిగే ఇతర కార్యక్రమాల్లోనూ ఆమెకు ఆఫర్స్ పెరిగాయి.

ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటీవల 'తిరుపతి దీపావళి ఉత్సవం-2017' నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటి హరితేజతో పాటు, మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డి హోస్ట్ గా వ్యవహరించారు. దీపావళి ఉత్సవం ఆద్యంతం ఈ ఇద్దరూ యాంకరింగ్ చేస్తూ సందడి చేశారు.

హరితేజ ఓవర్ యాక్టింగ్

హరితేజ ఓవర్ యాక్టింగ్

‘తిరుపతి దీపావళి ఉత్సవం-2017'లో హరితేజ యాక్టింగ్ కంటే ఓవర్ యాక్టింగ్ ఎక్కువగా చేసిందంటూ.... స్టేజీ మీద ఆమె ప్రవర్తన చూసిన చాలా మంది విమర్శలు చేయడం ప్రారంభించారు.

శృతి మించిన సెటైర్లు

శృతి మించిన సెటైర్లు

ఈ కార్యక్రమంలో హరితేజ, శివా రెడ్డి ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్న తీరు కూడా వరస్ట్ గా ఉందని అంటున్నారు. ఫన్ క్రియేట్ చేయాలి కానీ, దీని కోసం ఇలా ప్రవర్తించాల్సిన అవసరం లేదని అంటున్నారు.

ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో ఇలానా?

ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో ఇలానా?

ప్రభుత్వం తరుపున నిర్వహించే కార్యక్రమాలు చాలా హుందాగా సాగాలని, కానీ ఇక్బాకడ మాత్రం అలా సాగలేదనే విమర్శలు వినిపించాయి.

ప్రభుత్వ ఉత్సవంలా లేదు, కాలేజీ ఫంక్షన్ లా ఉంది..

ప్రభుత్వ ఉత్సవంలా లేదు, కాలేజీ ఫంక్షన్ లా ఉంది..

ప్రభుత్వం తరుపున జరిగిన ‘తిరుపతి దీపావళి ఉత్సవం-2017' ఉత్సవానికి చాలా మంది ఫ్యామిలీ ప్రేక్షకులు హాజరయ్యారు. ఇలాంటి కార్యక్రమాన్ని హుందాగా కాకుండా ఏదో కాలేజీ ఫెస్ట్ లా రచ్చ రంబోలా చేశారని కొందరంటున్నారు.

ఈడు నాకు అర్థం కాడురా

ఈడు నాకు అర్థం కాడురా

బిగ్ బాస్ లో హరితేజ హరికథలతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. దీపావళి ఉత్సవంలో ఓ సందర్భంలో శివా రెడ్డి స్టేజీ మీదకు రాక పోవడంతో హరితేజ తదనైన రీతిలో సెటైర్లు వేశారు. ఎంత పిలిచినా రానే రాడంట, ఎన్ని సార్లు చెప్పినా దాక్కొనే ఉంటాడంట.... శివా రెడ్డి కథ ఏందిరా... నా సామిరంగ ఈడు నాకు అర్థం కాడురా.... అంటూ హరితేజ తనదైన రీతిలో సెటైర్లు వేశారు.

ఏంది రా ఓవర్ గా మిమిక్రి చేస్తున్నావ్

ఏంది రా ఓవర్ గా మిమిక్రి చేస్తున్నావ్

శివా రెడ్డి స్టేజీ మీదకు రాగానే.... మిమిక్రి చేసి.. డాన్స్ చేసి... పాటలుపాడి బాగా మెప్పించి... మా అందరినీ తొక్కేస్తున్న ఉన్నావ్... మేమెక్కడి పోవాలిరా.. ఓ శివారెడ్డి అంటూ హరితేజ ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో శివా రెడ్డి..... తస్సరవ్వల బొడ్డూ అంటూ మిమిక్రి చేశాడు. దీనికి వెంటనే హరితేజ స్పందిస్తూ... ఏంది రా ఓవర్ గా మిమిక్రీ చేస్తున్నావ్ అంటూ... అతడిపై సెటైర్లు వేసింది హరితేజ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X