త్రీడీ 'టైటానిక్' విడుదల తేదీ ఖరారు
లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్‌లెట్ కాంబినేషన్ లో వచ్చిన 'టైటానిక్'మళ్ళీ మరోసారి మన మనస్సులను దోచుకోవటానికి ముస్తాబవుతోంది. ఏప్రియల్ మొదటి వారంలో ఈ చిత్రం విడుదల చేయనున్నారు. ఈనాటి టెక్నాలిజీకి అణుగుణంగా అంటే త్రీడిలో రూపుదిద్దుకుంటోంది. 1997లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల పంట పండించుకొంది. 'అవతార్' తరవాత జేమ్స్ మళ్లీ తన 'టైటానిక్'కే మెరుగులు దిద్దారు. మూడు సంవత్సరాలు కష్టపడి ఆ ప్రేమకథను త్రీడీలో ఆవిష్కరించారు. ఈ చిత్రం ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కానుంది.
ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ సంస్థ 'టైటానిక్ త్రీడీ' చిత్రాన్ని మన దేశంలో విడుదల చేయనుంది. ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ ''టైటానిక్‌ని త్రీడీలో చూడడం ఓ మర్చిపోలేని అనుభూతి. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దారు. మరోసారి జేమ్స్ మాయ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది''అన్నారు. అసాధారణ ప్రేమకథాచిత్రంగా, దృశ్యకావ్యంగా ప్రశంసలందుకున్న 'టైటానిక్' చిత్రం ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ ద్వారా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. 'టైటానిక్' చిత్రం 3డి వెర్షన్ రూపకల్పన 2009లో మొదలైంది. 2012 ఏప్రియల్ 15కల్లా టైటానిక్ ఓడ మునిగిపోయి వందేళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా ఈ ప్రేమకథను మరోసారి త్రీడి ఫార్మెట్ లో ఆవిష్కరించనున్నారన్నమాట.


Click it and Unblock the Notifications











