'టైటానిక్' చిత్రంలో కీలకపాత్రధారి మరణం
టైటానిక్ చిత్రంలో ముసలి రోజ్ గా నటించిన ఆమె ను ప్రపంచవ్యాప్తంగా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమె ఈ ఆదివారం లాస్ ఏంజిల్స్ లోని తన స్వగృహంలో మరణించింది. ఈ విషయాన్ని ఆమె మేనల్లుడు సిల్వియా ధామ్సన్ మీడియాకు తెలియచేసారు. మరణించేనాటికి ఆమె వందేళ్లు విజయవంతంగా పూర్తి చేసింది. ఆమె గత కొంతకాలంగా లంగ్ క్యాన్సర్ తో భాధపడుతోంది. ఇక ఆమెకు గతంలో బ్రెస్ట్ కాన్సర్ కూడా వచ్చి క్యూర్ అయిందని ధామ్సన్ చెప్తున్నారు. అయితే ఆమె చాలా ధైర్యస్తురాలని, అనారోగ్యాన్ని ఏనాడు లెక్క చేయలేదని ఆమె గురించి లాస్ ఏంజిల్స్ టైమ్స్ వారు రాసుకొచ్చారు. ఇక నటిగా ఆమె గోల్డ్ డిగ్గర్ వంటి చిత్రాలతో 1935 లోనే కెరీర్ ప్రారంభించారు. దాదాపు యాభై సినిమాలు దాకా ఆమె తన కెరీర్ లో పూర్తి చేసారు. అలాగే టైటానిక్ లోని పాత్ర రోజ్ లాంటి దాని కోసం దాదాపు తన కెరీర్ మొత్తం వెయిట్ చేసానని, అది తన దగ్గరకు వచ్చేసరికి తను టేస్ట్ చేసే వయస్సు దాటిపోయానని ఆమె భాధపడుతూ ఇంతకు ముందు ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఈ పెద్దామె మృతికి ధట్స్ తెలుగు నివాళులు అర్పిస్తోంది.


Click it and Unblock the Notifications











