పెద్దహీరోల సినిమా టైటిల్స్ డైలమా
తెలుగుసినిమాలకు కథలే కాదు టైటిల్స్‌కొరత కూడా ఉన్నట్టు కన్పిస్తోంది. మే నెలలో విడుదల కానున్న పెద్ద హీరోలసినిమాలకు ఇంకా టైటిల్స్ ఖరారు చేయకపోవడంతోబ్యానర్‌పేరుతోనే సినిమాను గుర్తుపెట్టుకోవలసిన పరిస్ధితి ఉంది. చిరంజీవి, నాగార్జున,బాలకృష్ణ, వెంకటేష్, ఎన్టీఆర్ సినిమాలకు ఇంకా టైటిల్స్ ఖరారుకాలేదు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైనచిరంజీవి చిత్రానికి జై చిరంజీవ టైటిల్ ఖరారైంది కానీషూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్న గీతా ఆర్ట్స్‌సినిమాకుటైటిల్‌ను ఫైనలైజ్ చేయలేదు. ఈసినిమాకు అందరివాడు అనే టైటిల్‌తాత్కాలికంగా అనుకున్నప్పటికీ ఖరారుచేయలేదు. టైటిల్స్ విషయంలోనిర్మాత ఎంఎస్ రాజు చాలా నయం. ఆయన నలుగురు పెద్ద హీరోలతోతీయబోయేచిత్రాలకు టైటిల్స్‌ను చాలా రోజుల క్రితమేటైటిల్స్ ప్రకటించారు. ప్రభాస్ హీరోగాపౌర్ణమి, వెంకటేష్‌తో ఆట చిత్రాలనుఆయన నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications











