నితిన్-ఇలియానా టైటిల్ గొడవ
నితిన్-ఇలియానాల సినిమాకు మొదట "రెచ్చిపో" అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాకు పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్లు కూడా వచ్చిన తర్వాత సినిమా టైటిల్ మార్చినట్టు సమాచారం. తాజాగా ఈ సినిమాకు "లోకల్" అని టైటిల్ పెట్టాలని దర్శకుడు పరుచూరి మురళి పట్టుబట్టి నట్టు తెలుస్తోంది. మూడక్షరాల సినిమా "పోకిరి" సూపర్ హిట్ కావడంతో అందరూ మూడక్షరాల సినిమాల మీద పడుతున్నారు. కానీ నిర్మాత ఇప్పటికే రెచ్చిపో అనే పోస్టర్లు కూడా వేసినందువల్ల టైటిల్ మార్చడానికి ఆయన అంగీకరించడం లేదని సమాచారం. గల్ఫ్ ఎడారుల్లో 45 రోజుల పాటు షూటింగ్ జరిగింది. మొత్తం యూనిట్ ఎంతో కష్టపడిందని నితిన్ చెప్పాడు. ఈ సినిమాని స్పెక్ట్రా మీడియా నిర్మిస్తోంది.
nitin ileana recchipo pokiri gulf paruchuri murali local media mahesh babu నితిన్ ఇలియానా పరుచూరి మురళి రెచ్చిపో లోకల్ పోకిరి గల్ఫ్ ఎడారులు


Click it and Unblock the Notifications