టైటిల్ - డామిట్ డేవిడ్ రాజుకు పెళ్లైపోయింది సినిమా లాంచ్
టాలీవుడ్ లో వైవిధ్యమైన కథలకు ఆదరణ లభిస్తున్న వేళ సరికొత్త కథా కథనాలు పురుడుపోసుకుంటున్నాయి. సినిమా చిన్నదైనా, పెద్దదైనా... ఆకట్టుకునే కథ ఉంటే చాలు జనాలు ఆదరిస్తున్న తరుణంలో... మరో విభిన్నమైన సినిమాకు శ్రీకారం చుట్టుకుంది. డామిట్ డేవిడ్ రాజుకు పెళ్లైపోయింది అనే భిన్నమైన టైటిల్ తో కొత్త చిత్రాన్ని లాంచ్ చేశారు. Sharp minds film factory బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరుగాంచిన జీవికే దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ప్రియతమ శిష్యుడిగా పేరుగాంచిన సంగీత దర్శకుడు ML రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీనగర్ కాలనీలోని MLR స్టూడియోస్ లో పూజాకార్యక్రమం నిర్వహించి...
Recommended Video

చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగానే ఆడియో రికార్డింగ్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్ పితాని రామకృష్ణ గౌడ్, వైస్ చైర్మన్ నెహ్రూ, తెలంగాణా బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.శంకర్ రావు, భువనతేజ ఇన్ఫ్రా ఛైర్మన్ చెక్కా సుబ్రహ్మణ్యం, ప్రముఖ దర్శకురాలు గౌరీ రోనంకి, దర్శకులు సుబ్బారావు, కట్టి మల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినిమాకు సంబంధించి త్వరలోనే నటినటులను అనౌన్స్ చేస్తామని చిత్ర బృందం వెల్లడించింది.


Click it and Unblock the Notifications











