టైటిల్ ఇంకా నిర్ణయించలేదు...మీ ప్రచారం ఆపండి

By Srikanya

Title is not finalised for Varun Teja film
హైదరాబాద్ : మీడియా విస్తృతి పెరిగిన తర్వాత కొంత ప్లస్, మరికొంత మైనస్ జరుగుతోంది. ముఖ్యంగా ఓ పెద్ద హీరో కానీ లేదా క్రేజీ హీరో చిత్రం కానీ ప్రారంభం అవుతూంటే ఆ చిత్రం టైటిల్ ఇదీ అంటూ ప్రచారం మొదలైపోతోంది. దాంతో సినిమా దర్శక,నిర్మాతలు అప్పటికే ప్రచారంలో ఉన్న టైటిల్ తో ముందుకు వెళ్లాలా లేక తాము అనుకున్న టైటిల్ ని పెట్టాలా అనే డైలామోలో పడిపోతున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ లాంచింగ్ చిత్రం కు అదే సమస్య ఎదురవుతోందని యూనిట్ తిట్టుకుంటోంది. ఈ చిత్రం గురించి గొల్లభామ, ఆరడుగుల బుల్లెట్ అంటూ రకరకాల టైటిల్స్ మీడియాలో ప్రచారం అయ్యాయి.

నిర్మాత మాట్లాడుతూ... ''మా సినిమా పేరు విషయంలో కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఇంకా ఏ పేరూ నిర్ణయించలేదు. త్వరలో ప్రకటిస్తాము''అన్నారు.ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. లియో ప్రొడక్షన్స్‌ పతాకంపై సినిమా రూపొందబోతోంది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం అందిస్తున్న దీనికి ఠాగూర్‌ మధు, నల్లమలుపు బుజ్జి నిర్మాతలు. గోదావరి అందాల నడుమ సాగే చక్కటి ప్రేమకథగా సినిమా ఉండబోతోందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. 'కొత్తబంగారులోకం',' సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో తనదైన ముద్ర తెలుగు తెరపై వేసి ఆకట్టుకొన్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఇప్పుడు వరుణ్‌తేజ్‌తో తొలి అడుగులు వేయించేందుకు సిద్ధమవుతున్నాడు.

అలాగే...గోదావరి అందాలు.. తెలుగు కుటుంబాల అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. వరుణ్‌, పూజల జంట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 35 రోజుల పాటు కోనసీమలో తెరకెక్కించిన సన్నివేశాలు చిత్రానికి ఆకర్షణగా నిలుస్తాయి. ఈ నెలాఖరుకు టాకీ చిత్రీకరణ పూర్తవుతుంది. మిగిలిన మూడు పాటలను వచ్చే నెలలో చిత్రీకరిస్తాం అని తెలియచేసారు.

నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్‌నుహీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రం తెరకెక్కుతోంది. పూజా హెగ్డే హీరోయిన్. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) నిర్మాత. ఠాగూర్‌ మధు సమర్పకులు. చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, రావు రమేష్‌, నాజర్‌ ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌,ఛాయాగ్రహణం: మణికందన్‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X