హింసాత్మకంగా ఉంది: వర్మ ‘వంగవీటి’ లోగో ఇదే (ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'వంగవీటి' అనే వివాదాస్పద సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో డిజైన్ రిలీజ్ చేసాడు. రక్త వర్ణంతో కత్తులు, సైకిల్ చైన్ తో ఈ లోగో ఉండటం బట్టి చూస్తే సినిమాలో కావాల్సినంత వయెలెన్స్(హింస) ఉంటుందని స్పష్టమవుతోంది.

ఈ సినిమా మొత్తం విజయవాడ రౌడీయిజం చుట్టూ తిరుగుతుంది. ఒకప్పుడు విజయవాడలో మాస్ లీడర్‌గా తన ఆధిపత్యం కొనసాగించిన వంగవీటి రంగా జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజయవాడలో రెండు అగ్రవర్ణం కులాల మధ్య జరిగిన ఆధిపత్య పోరు ఎలాంటి పరిణామాలకు దారిసిందనే అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

రామ్ గోపాల్ వర్మ అంటనే వివాదాస్పద సినిమాలకు కేరాఫ్ అడ్రస్. గతంలో రాయలసీమ ఫ్యాక్షనిజంపై రక్త చరిత్ర తీసిన వర్మ.....ఇపుడు 'వంగవీటి' సినిమాతో మరో వివాదానికి తెర తీసారు. ఈ సినిమాలో.....వంగవీటి రాధా, వంగవీటి మోహన రంగా, వంగవీటి రత్నకూమారి పాత్రలతో పాటు...దేవినేని నెహ్రు, దేవినేని గాంధీ, దేవినేని మురళి, కర్నాటి రామమోహనరావు, సిరిస్ రాజు, రాజీవ్ గాంధీ, దాసరి నారాయణ రావు, ముద్రగడ పద్మనాభం, నందమూరి తారక రామారావు పాత్రలను కూడా చూపించబోతున్నట్లు వర్మ ప్రకటించడం విశేషం.

Title logo of

ఈ సినిమా గురించి వర్మ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...

నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో అయినా , నేను నిజంగా పుట్టి పెరిగింది విజయవాడలో... ఎందుకంటే నాకు అవగాహన,తెలివి, బంధాలు, స్నేహాలు, ప్రేమించుకోవడాలు,చంపుకోవడాలు వీటన్నింటి గురించి తెలిసింది విజయవాడలోనే నేను అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీసిన రక్త చరిత్రకి ఇప్పుడు విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్న "వంగవీటికి" ముఖ్యమైన తేడా పగకి, ఆవేశానికి ఉన్న తేడా.

పగతో బుసలు కొట్టే ఫ్యాక్షనిస్ట్,శత్రువే ప్రపంచంగా బతుకుతాడు.. ఆవేశంతో రెచ్చిపోయే రౌడీ,ప్రపంచమే శత్రువుగా బతుకుతాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచం తనని ఒక మనిషిగా చూడని పరిస్థితిలోనే ఏ మనిషైనా ఒక రౌడీ అవుతాడు. ఫ్యాక్షనిస్ట్ తను చచ్చైనా శత్రువుని చంపాలనుకుంటాడు ... రౌడీ బతకడానికి మాత్రమే చంపుతాడు. ఈ భూమి మీద మనిషి పుట్టినప్పటినుంచీ ఇప్పటివరకూ సాగుతూ వస్తున్న హింసచరిత్రలో ఫ్యాక్షనిస్ట్ ఒక వారధి అయితే రౌడీ ఒక మలుపు.

ఫాక్షనిజం కి బ్యాక్ గ్రౌండ్ వారసత్వం అయితే రౌడీయిజానికి వారసత్వం దమ్ము ఒక దమ్మున్నోడు సింహాసనం మీద కూర్చున్న ఇంకో దమ్మునోడిని పైకి పంపటమే అసలు సిసలైన నిజమైన రౌడీయిజం. అలాంటి రౌడీయిజం రూపాన్ని, దాని ఆంతర్యాన్ని 30 ఏళ్ళ క్రితం నేను విజయవాడ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నప్పుడు,బాగా దగ్గరగా స్వయంగా నా కళ్ళతో చూశాను ... అందుకనే విజయవాడ రౌడీయిజం గురించి నాకన్నా ఎక్కువ తెలిసిన వాడు, విజయవాడలో కూడా లేడని బల్ల గుద్దే కాకుండా కత్తితో కూడా పొడిచి చెప్పగలను.

"వంగవీటి" చిత్రం తెలుగులో నా ఆఖరి చిత్రం అవుతుంది.. "శివ" తో మొదలైన నా తెలుగు సినిమా ప్రయాణం "వంగవీటి"తో ముగించాలని నేను తీసుకున్న నిర్ణయానికి కారణం "వంగవీటి" కన్నా అత్యంత నిజమైన మహా గొప్ప కథ మళ్ళీ నాకు జీవితంలో దొరకదని నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి. వంగవీటి రాధాగారు,చలసాని వెంకటరత్నంగారిని చంపడంతో ఆరంభమైన విజయవాడ రౌడీయిజం, వంగవీటి రంగాగారిని చంపడంతో ఎలా అంతమయ్యిందో చూపించేదే "వంగవీటి" చిత్రం కత్తులు, బరిసెలు, అంబాసిడర్ కార్లు, మెటాడోర్ వాన్లు వుండి,సెల్ ఫోన్లు, తుపాకులు లేని 30 ఏళ్ళ క్రితంనాటి ఆ నాటివిజయవాడ వాతావరణాన్ని పునసృష్టించటానికి ఖర్చుకి ఏ మాత్రం వెనకాడద్దని "వంగవీటి" నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో, విజయవాడ గత చరిత్రని ఇప్పటికి, ఎప్పటికి చరిత్రలో నిలిచిపోయేలా చెయ్యటానికి మా"వంగవీటి" యూనిట్ శరవేగంతో సిద్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X