రామ్ చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' టైటిల్ లోగో( పోస్టర్స్)

By Srikanya

హైదరాబాద్: రామ్ చరణ్,కృష్ణ వంశీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం టైటిల్ ని 'గోవిందుడు అందరివాడేలే' అని ఖరారు చేస్తూ పోస్టర్స్ విడుదల చేసారు. ఈ రోజు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా ఈ పోస్టర్స్ ని,నిన్న ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి అభిమానులను ఆనందపరిచారు. ఈ టైటిల్ గతంలో చిరంజీవి చిత్రం అందరివాడులోని టైటిల్ సాంగ్ నుంచి తీసుకున్నది కావటం విశేషం. కాజల్‌ హీరోయిన్. శ్రీకాంత్‌, కమలినీ ముఖర్జీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత.

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో చరణ్‌ పల్లెలో అడుగుపెట్టే ఎన్నారై పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యూనిట్‌ కన్యాకుమారి, పొలాచ్చి షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుని హైదరాబాద్‌ చేరింది. ఏప్రిల్‌ రెండోవారం నుంచి హైదరాబాద్‌ రామానాయుడు సినీవిలేజ్‌లో ఇల్లు సెట్‌లో, ఆర్‌ఎఫ్‌సిలో తదుపరి షెడ్యూల్‌ని చిత్రీకరించనున్నారు. నేడు చెర్రీ పుట్టినరోజు సందర్భంగా పరమేశ్వర ఆర్ట్‌‌స అధినేత బండ్లగణేష్‌ అండ్‌ టీమ్‌ శుభాకాంక్షలు చెప్పారు.

నిర్మాత మాట్లాడుతూ ''తెలుగుదనం ఉట్టిపడే కథ కథనాలతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇటీవలే కన్యాకుమారి, పొల్లాచ్చి, రామేశ్వరంలో కీలక సన్నివేశాలు తెరకెక్కించాం. ఏప్రిల్‌ రెండోవారంలో హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ ప్రారంభిస్తాం. రామోజీఫిల్మ్‌సిటీలో కొంతభాగం తెరకెక్కిస్తాం. విదేశాల్లో పాటల్ని చిత్రీకరిస్తాం. రామ్‌చరణ్‌, రాజ్‌కిరణ్‌, శ్రీకాంత్‌ల మధ్య తెరకెక్కించిన సన్నివేశాలు.. ఇంటిల్లిపాదినీ ఆకట్టుకొనేలా ఉన్నాయి'' అన్నారు.

Title posters of Ramcharan new film

చాలా కాలం తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్‌తో కనిపించబోతున్నాడు రామ్‌చరణ్‌. తాత, మనవడుగా రాజ్‌కిరణ్‌, చరణ్‌ల నటన చిత్రానికి ప్రధానాకర్షణగా నిలవబోతోంది. ఇందులో ప్రధాన పాత్రధారుల ఆహార్యం, ఆభరణాలు అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి. ఇందులో రామ్‌చరణ్‌ పంచెకట్టుతో ఎడ్లబండిపై తన తాత పాత్రధారి రాజ్‌కిరణ్‌తో తిరుగుతూ కనిపిస్తాడు.

కృష్ణవంశీ మాట్లాడుతూ... తాను ప్రస్తుతం రామ్ చరణ్ తో 'మురారి' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే పనిలో ఉన్నానని కృష్ణ వంశీ చెప్పుకొచ్చారు తండ్రిగా నాగార్జునని అడుగుతున్నారని తెలుస్తోంది. తాతగా రాజ్ కిరణ్ కనిపించనున్నాడు.

రామ్ చరణ్ తొలిసారిగా పల్లెటూరి నేపథ్యమున్న యువకుడిగా కనిపించబోతున్నాడు. హైదరాబాద్‌లో రూపొందించిన సెట్‌లో కుటుంబ నేపథ్య సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు.
మే నుంచి విదేశాల్లో చిత్రీకరణ జరుపుతారని సమాచారం. కుటుంబ అనుబంధాలతో పాటు, చరణ్‌ శైలికి తగ్గ మాస్‌ అంశాలు కూడా చిత్రంలో ఉంటాయి.

ఈ చిత్రంలో తమిళంలో విలక్షణ నటుడుగా పేరుగాంచిన రాజ్ కిరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X