నాగచైతన్య, శోభిత అఫైర్ లీక్ చేసిన సమంత.. ఎవరు పట్టించుకోలేదేంటి?

అక్కినేని వారసుడు, యువ హీరో నాగచైతన్య నిశ్చితార్థం శోభిత దూళిపాళ్లతో జరిగిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని మొదటగా అక్కినేని నాగార్జున పోస్ట్ చేశారు. ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ శుభకార్యం జరిగి రెండు రోజులు అయినా ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. కానీ, అసలు వీళ్ల ప్రేమ ఎక్కడ మొదలైందనే ఇప్పటి వరకు పెద్దగా సమాచారం లేదు. అయితే శోభిత దూళిపాళ్ల చెల్లెలు సమంత దూళిపాళ్ల ఆ విషయాన్ని బయటపెట్టేసింది. అసలు ఆ కథేంటో చదివేద్దాం.

అక్కినేని నట వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగచైతన్య.. తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసినా కానీ లవర్ బాయ్, క్లాస్ హీరోగా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడీ ఈ కుర్ర హీరో. సినిమాల్లో తప్ప బయటికి పెద్దగా కనిపించని నాగచైతన్య వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులతో వార్తల్లో ఎక్కువగానే కనిపిస్తాడు, వినిపిస్తాడు. తనతో కలిసి నటించిన హీరోయిన్ సమంతతో ప్రేమాయణం దగ్గరి నుంచి పెళ్లి, విడాకుల వరకు ఓ సినిమాను గుర్తుచేస్తోంది.

Title shobhitha dulipalla sister Samanta reveal nahachaithanya shobhitha love story

ఏమాయే చేశావే సినిమాతో ఏర్పడిన పరిచయంతో హీరోయిన్ సమంతతో ప్రేమలో పడ్డాడు చైతూ. చాలా రోజులు గుట్టుగా ప్రేమను నడిపారు వీరిద్దరు. ఎప్పటికైనా బయటపడాల్సిందే కాబట్టి ఓ శుభ సందర్భాన బయటకు వచ్చేసింది. చైతూ-సామ్ అంటూ ముచ్చటైన జంటగా అభిమానులు మురిసిపోయారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు క్యూట్ కపుల్ గా కనిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబం అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యామిలీ కదా. మరి సాదాసీదాగా పెళ్లి చేస్తే ఏం బాగుంటుందని ఓ రేంజ్ లో చేశారు. సమంత క్రిస్టియన్, నాగచైతన్య హిందువు కావడంతో ఎవరూ నొచ్చుకోకుండా రెండు పద్దతుల్లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. కొన్నాళ్లు ముచ్చటగా సాగింది వీరి సంసార జీవితం. తర్వాత వచ్చిన కొన్ని అనివార్య కారణాలతో అభిమానుల గుండెల్లో పిడుగులాంటి వార్త చెప్పారు. అదే విడాకులు. అప్పటి నుంచి ఎవరి జీవితాల్లో వారు బీజీ అయిపోయారు.

అయితే ఎవరూ ఊహించని విధంగా సడెన్ గా నాగచైతన్య-శోభిత దూళిపాళ్లకు నిశ్చితార్థం అయినట్టు వార్త బయటకి వచ్చింది. అది కూడా వీరు చేసుకునేది ప్రేమ పెళ్లి అంట. 2021 లో సమంతతో విడిపోయాక 2022 నుంచి వీరి మధ్య ప్రేమ మొదలైందంట. ఇన్ని రోజులు ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నాక పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కారు. అసలు ఈ విషయాన్ని స్వయాన శోభిత చెల్లెల్లు సమంత దూళిపాళ్ల బయటపెట్టారు. ఎంగేజ్ మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన సమంత.. 2022 లో తన అక్కతో కలిసిన ఉన్న ఫొటోకు చైతూ లైక్ కూడా కొట్టారని, కాకపోతే ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది.

Title shobhitha dulipalla sister Samanta reveal nahachaithanya shobhitha love story
సమంతతో విడిపోయాక కొంతమంది హీరోయిన్స్ తో ఎఫైర్ నడుపుతున్నట్టు, పెళ్లి చేసుకోబోతున్నట్టు పుకార్లు షికారు చేశాయి. కానీ వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు చైతు. ఎవరూ ఊహించని విధంగా శోభిత దూళిపాళ్లతో నిశ్చితార్థం కానిచ్చేశాడు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమాతో చైతూ బీజీగా ఉన్నాడు. తర్వాత కూడా మరో కొత్త ప్రాజెక్టు కూడా షురూ చేసినట్టు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X