23 ఏళ్లకే మొత్తం చూపించా, మందు కొట్టాక కావాలంటారు, రాత్రికి 15 లక్షలు: షకీలా
Recommended Video
నటి షకీలా గురించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఆమె తన శృంగార చిత్రాలతో స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడింది. ఆమె జీవితంలో పడ్డ కష్టాల గురించి, ఎవరి వల్ల ఆమె తన ఆస్తులు పొగొట్టుకుందనేది దాదాపుగా అందరికీ తెలిసిన విషయాలే. గతంలో ఎన్నో ఇంటర్వ్యూల్లో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. తాజాగా ఆమె నుంచి మరిన్ని విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు టిఎన్ఆర్. ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియని విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో ఆసక్తి రెత్తిస్తోంది. అందులో షకీలా ఏం చెప్పారు అనేది ఓ లుక్కేద్దాం.

ఆస్తి పోగొట్టుకునేంత తప్పు ఏం జరిగింది? అంత కేర్ లెస్‌గా ఎలా ఉన్నారు?
మా వాళ్లపై నమ్మకమే నేను ఈ స్థితికి రావడానికి కారణమైంది. అక్క నన్ను మోసం చేస్తుందని ఊహించలేదు. ఏవో సాకులు చెప్పి భూములు కూడా కొనకుండా చేసింది. విడిపోయాక ఇద్దరి మధ్య కాంటాక్ట్ లేదు. ఎప్పుడూ ఎదురు పడలేదు. తప్పు నాది కాదు అని ఏదో ఒకరోజు ఆవిడకు అర్థమవుతుంది.

మీ అమ్మను కూడా ఎందుకు అసహ్యించుకున్నారు?
ఏ అమ్మకైనా అందరు పిల్లలు సమానమే. కానీ మా అమ్మ నన్ను వేరుగా, తక్కువగా చూసేది. చిన్నప్పటి నుంచి అంతే. ఎందుకో నాకు తెలియదు. నేను సంపాదించే సమయంలో కూడా అలాగే చూసేది.

నాకు అవసరం అయినపుడు వర్జినిటీ లేదు
అమ్మనే నన్ను ఫస్ట్ టైమ్ ఓ హోటల్‌లో వ్యక్తి దగ్గరకు పంపింది. అప్పుడు ఆయన్ను బ్రతిమిలాడితే వదిలేశాడు. ఏ వయసులో వర్జినిటీ పోయిందో గుర్తు లేదు. కానీ నాకు ఎప్పుడు అది కావాలో, ఎవరితో ఉండాలనుకున్నపుడు అవసరమో అప్పుడు నాకు కన్యత్వం లేకుండా పోయింది.

నా ప్రేమికుల్లో అతడే చివరి వాడు
ఇప్పటి వరకు ఏడెనిమిది మందిని ప్రేమించాను. కొందరితో 4 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, చివరగా నితీశ్ కుమార్‌తో 10 సంవత్సరాలు ప్రేమ బంధం కొనసాగింది. వారితో నేను కాంప్రమైజ్ అయ్యుంటే పెళ్లి ఎప్పుడో అయ్యుండేది.

లగ్జరీ లైఫ్ లేదు
నాకు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది లేదు. నేనేమీ లావిష్ జీవితం గడపటం లేదు. కంఫర్టబుల్ జీవితం గడుపుతున్నానంతే.... షకీలా లగ్జరీ లైఫ్ అనేది నిజం కాదు. రోజూ మా ఇంటికి నలుగురు ఐదురుగు వస్తారు, తింటారు, తాగుతారు, ఆ ఖర్చు నేనే భరిస్తాను.

అబ్బాయిల కంటే అబ్బాయిలతో మందు కొట్టడమే ఇష్టం, ఎందుకంటే...
మందు పార్టీల్లో అబ్బాయిల కంపెనీ కంటే అమ్మాయిల కంపెనీనే కోరుకుంటాను. ఎందుకంటే అబ్బాయిలు చివరికి ఏమి కోరుతారో నాకు తెలుసు. అందుకే అమ్మాయిలతో మందు తాగడానికే ఇష్టపడతాను.

ఇష్టానికి డ్రెస్ ఎత్తేస్తారు
సినిమాల్లో రొమాంటిక్ సెక్స్ సీన్లు చేసేపుడు అలసిపోయి నిద్రపోవడం లాంటి జరుగలేదు. అలా చేస్తే ఇష్టానికి డ్రెస్ ఎత్తేస్తారు. ఆ సమయంలో కాన్సియస్‌లోనే ఉంటాను. మీటూ, కాస్టింగ్ కౌచ్ లాంటివి ఓ సినిమాకు ఎదురైంది. సినిమా అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ అడిగాడు. అతడి పేరు నేను చెప్పాలనుకోవడం లేదు.

ఒక్కరాత్రికి 15 లక్షలు ఇస్తామన్నారు
నాకు షూటింగ్‌లో రోజుకి రూ. 10 వేలు దొరికినపుడే ఎప్పుడూ ఆ పని చేయనని ప్రామిస్ చేసాను. కాని రోజుకి రూ.3 లక్షలు వచ్చే టైంలో.. ఒక రాత్రికి రూ. 15 లక్షలు ఇస్తామని అడిగారు. 3 లక్షలా... 15 లక్షలా అని చూస్తే? 15 లక్షలు అనేది ఈజీ... కాని దేవుడిని మనం ఏమార్చలేం కదా? ఆ భయంతో అలాంటివి వద్దు అనుకున్నాను.

23 ఏళ్లకే అన్నీ చూపించా
ఇక ముందు ఎక్స్ ఫోజింగ్ క్యారెక్టర్లు, పోర్న్ టైప్ పాత్రలు చేస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ... ఎక్స్ ఫోజింగ్ చేసే వయసు అయిపోయింది. నా వయసు 42 సంవత్సరాలు, 23 సంవత్సరాల్లోనే మొత్తం చూపించాను. ఇపుడు మంచి యాక్టింగ్ చూపించాలి అనేది నా టార్గెట్. ప్రస్తుతం ‘కొబ్బిరి మట్ట' చిత్రంలో చేశాను.


Click it and Unblock the Notifications











