ఆ సెక్సీ హీరోయిన్ ఒప్పుకుంది
పాపులర్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ మొత్తానికి ఇండియన్ సినిమా చేయటానికి ఓకే అంది. మహేష్ భట్ తన జిస్మ్ చిత్రం సీక్వెల్ లో ఆమెకు రోల్ ఆఫర్ చేసినా కాదన్న ఆమె ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆమె అభిమానులకు ఆనందం కలుగచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఈ ఇండో-కెనడా ఫోర్న్ స్టార్ ఇటీవలే బిగ్‌బాస్ రియాల్టీ షో కోసం మన దేశానికి వచ్చింది. ఇదే సమయంలో 'జిస్మ్-2'లో నటించమంటూ మహేష్ భట్ ఆమెను సంప్రదించారు. 2003లో వచ్చిన 'జిస్మ్'కి కొనసాగింపు తీస్తున్నారు. అయితే అప్పుడు సన్నీ అంగీకారం తెలుపలేదు. ఇటీవలే ఆమె బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చేసింది.
ఇప్పుడు భట్‌ని కలిసి ఆ చిత్రం గురించి చర్చించేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె ఆ వివరాలు వెల్లడిస్తూ ''మహేష్ భట్ అప్పుడు అంతగా తెలియదు. ఆ తరవాతే తెలిసింది... ఆయన ఎంత పెద్ద దర్శకుడో. భట్ ద్వారా హిందీ చిత్రసీమకు పరిచయం కావాలని ఉంది'' అంటోంది. అలాగే తను ఫోర్న్ స్టార్ అయినందుకు ఏమీ సిగ్గపుడటం లేదని చెప్పుకొచ్చింది. తనకు ఇష్టమైన మార్గంలో స్వేచ్చగా జీవితం గడపాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని అంది. తనకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండటం ఇష్టం ఉండవని అంది. ఇక మొదట్లో తన తల్లి తండ్రులు అందరిలాగే ఇలా ఫోర్న్ స్టార్ అవ్వటానికి ఇష్టపడలేదని కానీ, తను ఆ మార్గంలోకి వెళ్లతానని పూర్తిగా నిర్ణయించుకున్నానని అర్దం చేసుకున్నాక కొన్ని కండిషన్స్ తో ఓకే చేసారని, తన తల్లితండ్రులు, స్నేహితుల నుంచి ఇలాంటి విషయాలు ఎంత కాలం దాయలేమని, అందుకే మొదటే చెప్పేసానని ఆమె చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications












