నేడు డైరెక్టర్ శంకర్ పుట్టిన రోజు
భారత్ దేశంలోని దిగ్రేట్ దర్శకుల్లో శంకర్ ఒకరు. తక్కువ సినిమాలతో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు కూడా ఈయనే. ఈ రోజు శంకర్ పుట్టిన రోజు. ఆగస్టు 17, 1963లో తమిళనాడులోని కుంభకోణంలో జన్మించిన శంకర్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సినిమాలపై ఆసక్తితో దర్శకత్వం వైపు మళ్లి తన సినిమాలతో ప్రభంజనం సృష్టిస్తున్నాడు.
శంకర్‌కు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా 'జెంటిల్ మెన్". అప్పట్లో ఇది బిగ్గెస్ట్ హిట్ సినిమా నిలిచింది. అప్పటి నుంచి శంకర్ వెనుదిరిగి చూడలేదు. ప్రేమికుడు, జీన్స్, భారతీయుడు, ఒకే ఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, ప్రేమిస్తే, శివాజీ, రోబో లాంటి సినిమాలతో బాక్సాఫీసును షేక్ చేశాడు. ప్రస్తుతం శంకర్ సినిమాల మర్కెట్ రూ. 100 కోట్లపైనే. శంకర్ చివరి సారిగా దర్శకత్వం వహించిన రోబో సినిమా 200 కోట్ల పైచిలుకు వసూళ్లను కొల్లగొట్టింది. వైవిద్యంతో పాటు గ్రాఫిక్స్, విజువల్‌ఎఫెక్ట్స్ వంటి సాంకేతిక అంశాలకు పెద్ద పీఠ వేయయడం శంకర్ స్టయిల్.
హిందీలో వచ్చిన 3 ఇడియట్స్ ఆధారంగా శంకర్ తొలిసారిగా మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజయ్, జీవ, శ్రీకాంత్, ఇలియాన, ఎస్ జె సూర్య, అనుయ, లారెన్స్, సత్యరాజ్ తదితరులు ఇందులో నటిస్తున్నారు. మరి శంకర్ మరిన్ని పుట్టి రోజులు జరుపుకుంటూ ప్రేక్షకులను రంజింప చేయాలని ఆశిస్తూ 'వన్ ఇండియా" తరుపున విష్ చేద్దాం.


Click it and Unblock the Notifications











