నేడే ఢీ అంటే ఢీ అనబోతున్న జూ ఎన్టీఆర్
ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్ ఈటీవీ నిర్వహిస్తోన్న 'ఢీ' ప్రోగ్రామ్ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుదేవా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమం రెండవ భాగం అయిన 'ఢీ-2' చివరి అంకానికి చేరుకొంది. ఉదయభాను వ్యాఖ్యానం అదనపు ఆర్షణగా సాగిపోతున్న ఈ కార్యక్రమం ఫైనల్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అథితిగా పాల్గొంటాడని ఉదయభాను వారం నుండీ ఊరిస్తూనే వుంది. పోయిన వారం ప్రభుదేవా ఈ కార్యక్రమానికి హాజరుకాగా, ఈ వారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోతున్నాడు.
ఈ షోకి సెలబ్రిటీ జడ్జ్ గా ఎన్టీఆర్ హాజరుకానున్నాడు. ఈ రోజు కోసం ఎన్టీఆర్ అభిమానులు, ప్రేక్షకులు కూడా ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. డాన్స్ లో మంచి ఈజ్ ను ప్రదర్శించే ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఎలాంటి టిప్స్ ఇవ్వనున్నాడో, వారు ఎన్టీఆర్ నుండీ ఎలాంటి ప్రశంసలు అందుకోనున్నారో చూడాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేస్తే చాలు....


Click it and Unblock the Notifications











