మొదట ఇలాంటి అబ్బాయా? అని ఫీలైన నమ్రత: మహేష్ బాబుతో అలా ప్రేమ, పెళ్లి..
స్టార్ మహేష్ బాబు, నమత్ర దపంతులు వైవాహిక బంధంలోకి అడుగు పెట్టి నేటితో సరిగ్గా 14 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ స్పెషల్ మూమెంటును పురస్కరించుకుని సూపర్ స్టార్ సోషల్ మీడియా ద్వారా తన అర్దాంగికి విషెస్ తెలియజేశారు.
నమ్రత తన జీవితంలోకి వచ్చిన తర్వాత మరింత సంతోషం తన లైఫ్‌లోకి వచ్చినట్లయిందని మహేష్ బాబు తరచూ చెబుతుంటారు.
మహేష్ బాబు రొమాంటిక్ ట్వీట్
తమ పెళ్లి రోజు సందర్భంగా భార్య నమ్రతతో దిగిన ఒక రొమాంటిక్ ఫోటోను మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. తమ వివాహం జరిగి సరిగ్గా పద్నాలుగు సంవత్సరాలైంది అంటూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

ప్రేమ వివాహం
మాజీ ఫెమీనా మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్‌తో 5 సంవత్సరాలు డేటింగ్ చేసిన మహేష్ బాబు ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 10, 2005లో వీరి వివాహం ముంబైలో జరిగింది. 14 ఏళ్ల తమ దాంపత్య జీవితంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు మహేష్, నమ్రత. ఆగస్టు 31, 2006న కుమారుడు గౌతంకృష్ణ జన్మించగా, జులై 20, 2012న కూతురు సితార జన్మించింది.

తొలిసారి కలిసినపుడు ఈ అబ్బాయితోనా అని ఫీలైన నమ్రత
మహేష్ బాబును కలిసిన తొలి క్షణాలు గురించి నమ్రత గతంలో మాట్లాడుతూ... ‘వంశీ సినిమా ముహూర్తం టైంలో మొదటిసారి తనని కలిశాను. చాలా రిజర్వ్‌డ్‌గా, క్వైట్‌గా కూర్చున్నారు. కనీసం హలో కూడా చెప్పలేదు. అప్పుడనుకున్నా... 'ఓ గాడ్, ఈ అబ్బాయితోనా అన్నిరోజులు కలిసి షూటింగ్ చేయాల్సింది' అని! అన్నారు.

అలా ప్రేమ మొదలైంది.
షూటింగ్ మొదలైంది. న్యూజిలాండ్ వెళ్లాం. నేనే ఓరోజు ఈ ఇబ్బందిని తొలగించాలనుకుని తనతో కూర్చుని కాసేపు మాట్లాడా. మాట్లాడాక తెలిసింది... తను చాలా ఫన్ లవింగ్ పర్సన్ అని, విపరీతమైన సెన్సాఫ్ హ్యూమర్ ఉందని, తను మాట్లాడడం మొదలెడితే నవ్వు ఆపలేమని, తనతో కూర్చుంటే టైం అసలు తెలీదని! తను కూడా కొన్నిరోజులకి ఫ్రీగా ఫీలయ్యి, మాట్లాడడం మొదలెట్టారు. మెల్లగా కలిసి, డిన్నర్‌లకి, సినిమాలు చూడ్డానికి వెళ్లేవాళ్లం. ఇద్దరి స్నేహం అలా మొదలై, ఒకరినొకరు ఇష్టపడేదాకా వచ్చింది అని నమ్రత చెప్పుకొచ్చారు.

దానికి పెళ్లి ఒకటే మార్గం అనుకుని
ఇక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చిందనే విషయం తెలుపుతూ... ‘ఒకరి మీద ఒకరికున్న ఇష్టం ఏ లెవెల్ దాకా వెళ్లిందంటే, విడిగా ఉండడం చాలా కష్టమనేంతగా, ఇద్దరం సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కలవడం వీలయ్యేది కాదు. ఇద్దరం కలిసి ఉండాలంటే పెళ్లి ఒకటే మార్గం అనుకున్నాం. నా ఫిల్మ్ ఎసైన్‌మెంట్స్ అన్నీ పూర్తయ్యేదాకా వెయిట్ చేసి ఇంట్లోవాళ్లకి చెప్పాం' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











