నా కాలికింద కోట్లు సంపాదిస్తున్నారు.... ప్రియాంకా చోప్రా సంచలన వ్యాఖ్య

వివిద రకాల బ్రాండ్లకి అంబాసిడర్లు గా సినీ తారలూ, సెలబ్రిటీలూ ఉండటం మామూలే అయితే ప్రమోట్ చేసే బ్రాంద్ ని బట్టి వారి శరీర భాగాలని కూడా ఎక్కువగా చూపించాల్సి వస్తుంది. అదే విషయాన్ని చెప్తూ... నా కాళ్ళమీద 12 నుంచి 15 బ్రాండ్లు ఆధార పడి ఉన్నాయి అని చెప్పింది బాలీవుడ్ బ్యూటీ సారీ హాలీవుడ్ బ్యూటీ అనాలేమో... మరీ అంత మాట అనేసిందేమిటీ అనుకునే లోపే "కాళ్లను మోడల్ గా చూపుతూ... ఆ బ్రాండ్ లు తమ అమ్మకాలు సాగిస్తున్నాయి అంటూ నవ్వేసింది. సౌందర్యోపకరణాలు, బ్రాండెడ్ దుస్తులు, షూలు, చెప్పులు, నెయిల్ పాలిష్ లు.. ఇలా కేవలం తన కాళ్ల ను మోడల్ గా చూపుతూ అన్ని బ్రాండ్లు అమ్మకాలు సాగిస్తున్నాయని...ఒక ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలని పంచుకుంది

చిన్నప్పుడు అందం మీద, శరీరాన్ని సుకుమారంగా చూసుకోవడం మీద ధ్యాస ఉండేది కాదని, ఆటలాడుతూ చాలాసార్లే కింద పడటం తో అనేక సార్లు మోకాళ్లకు గాయాలు కూడా అయ్యాయని.. శరీరాన్ని సుకుమారంగా చూసుకోవాల్సిన అవసరం ఏమిటో ఆ తర్వాత అర్థం అయ్యిందని ఆమె వివరించింది.

టీనేజ్ లో టామ్ బాయ్ లా తిరిగినచిన్న తనం లో మరీ అబ్బాయిల్లా తిరగటం వల్ల. శరీరాన్ని కాపాడుకోవడంపై స్వతహాగా వచ్చిన అవగాహనతో తన కాళ్లు ప్రపంచంలోనే అందమైనవి అనిపించుకున్నాయట. ఇప్పుడు వాటి మీద కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందని గమ్మత్తుగా వివరించింది. తనకు తాను బెస్ట్ వెర్షన్ గా మార్చుకోవటానికి కొన్ని సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చిందంటూ ప్రియాంక చెప్పింది.

Today My Legs Sell 12-15 Products In India says Priyanka Chopra

ఇటీవలి కాలంలో హాలీవుడ్ టీవీ సిరీస్ క్వాంటికోలో బిజీ అవడం, అంతకన్నా ముందే ఓ ఆల్బం మార్కెట్‌లోకి రిలీజ్ చేయడం లాంటివి ఇప్పటివరకు ప్రియాంకా చోప్రా జాబితాలో వున్న సక్సెస్ స్టోరీస్. కానీ వీటికితోడు తాజాగా వచ్చిచేరిన ఘనత మాత్రం మామూలుది కాదండోయ్. హాలీవుడ్ హీరోయిన్లు, మోడల్స్ ని పక్కకుపెడుతూ మన ప్రియాంకా చోప్రాకి హాలీవుడ్స్ రాయల్ కిరీటం తొడిగింది డబ్ల్యూ మ్యాగజైన్ అనే ఫ్యాషన్ మ్యాగజైన్.

ఈ కిరీటం దక్కించుకున్న మొట్టమొదటి ఇండియన్‌గా ప్రియాంకా రికార్డ్ కొట్టేసింది. హాలీవుడ్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఈ రాయల్ కిరీటాన్ని ఓ గొప్ప విజయంగా భావిస్తారు. హాలే బెర్రి, క్రిస్ ఇవన్స్, చివెటెల్ ఇజియోఫర్, కాన్యెవెస్ట్, కిట్ హ్యారింగ్టన్, జోడీ ఫాస్టర్ వంటివారికి మాత్రమే గతంలో ఈ రాయల్ కిరీటం దక్కింది. ఇప్పుడా అరుదైన జాబితాలోకి ప్రియాంకా చోప్రా పేరు కూడా చేరిందన్నమాట.

ప్రియాంకా చోప్రా ఇప్పుడు య‌మ బిజిగా ఉంది..క‌నీసం రెండేళ్ల వ‌ర‌కైన బాలీవుడ్ లో సినిమాలు ఆమె ఒప్పుకునే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు.. ఇటీవ‌లే బేవాచ్ షూటింగ్ ముంగించుకుని వ‌చ్చిన ప్రియాంక ఏకంగా 42 వ్యాపార ప్ర‌క‌ట‌న చిత్రాల షూటింగ్ లో పాల్గొంది.. ప్ర‌స్తుతం ఏదైనా బాలీవుడ్ మూవీకి వారం రోజులు మించి డేట్స్ ఇవ్వ‌లేన‌ని అంటున్న‌ది.. హాలీవుడ్ మూవీ షూటింగ్ విరామంలో వ‌చ్చి పాల్గొంటాన‌ని నిర్మాత, ద‌ర్శ‌కుల‌కు చెబుతుంద‌ట‌.. దీంతో ఆమె ఇచ్చిన డేట్స్ లోనే మూవీలు చేసేందుకు సిద్ద‌ప‌డుతున్నార‌ట‌.. అటు హాలీవుడ్, ఇటు బాలీవుడ్ ల‌లో ఇప్పుడు య‌మ బిజి హీరోయిన్ మ‌న ప్రియాంకా చోప్రా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X