వరల్డ్ రికార్డ్స్ ఆద్వర్యంలో రాణాతో సెక్సీ హీరోయిన్ ఘనంగా పెళ్ళి

By Sindhu

శీను వాసంతి లక్ష్మీతో పరిచయమైన నవనీత్ కౌర్ ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. కొన్ని సినిమాల్లో అవసరానికి మించి ఎక్స్ పోజింగ్ కూడా చేసింది. అయితే హీరోయిన్ గా అనుకున్నంత గుర్తింపు రాని ఈ అమ్మడు ఇక లాభం లేదనుకొని పెళ్లికి రెడీ అయిపోయింది. తన అందాల్ని మరింత మెరుగు పరుచుకునేందుకు రామ్ దేవ్ బాబా ఆశ్రమంలో చేరిన నవనీత్ అక్కడ పరిచయమైన ఓ ఎమ్మేల్యేతో ప్రేమలో పడింది. మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యే రవిరాణా నవనీత్ అందాల్ని చూసి ఫిదా అయిపోయాడట. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వెంటనే ఓకే చెప్పేసింది.

ఈ రోజు(01.02.11)వీరిద్దరి వివాహం జరగనుంది. పెళ్ళయిన తర్వాత ఇక సినిమాల్లో నటించనని స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసింది. మరి వారి వివాహంతో పాటు అదే వేదికపై వివిధ కులాలు, మతాలకు, విశ్వాసాలకు చెందిన దాదాపు 2100 జంటలు ఒకటవనున్నాయి. మహారాష్ట్రలోని అమరావతిలో ఈ పెళ్ళిళ్ళు జరగనున్నాయి. ఈ ఏర్పాట్లు చేస్తున్నది నవనీత్ కౌర్ కాబోయే భర్త రవిరాణానే కావటం మరో విశేషం. నాలుగు లక్షల గజాల ప్రాంగణంలో లక్ష గజాల వేదికపై 2100 జంటలలో ఒకరిగా వీరి పెళ్ళి జరగనుంది.

అంతేకాదు ఈ వివాహాల వేడుకను రికార్డ్ చేయడానికి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు కూడా వస్తున్నారు. దాదాపు ఐదు లక్షల మంది సమక్షంలో జరిగే ఈ భారీ సమూహ వివాహ కార్యక్రమానికి ఆచార్య రామ్‌దేవ్ ముఖ్య అతిధిగా హాజరవుతారు. అర కొర సినిమాలు కూడా లేని నవనీత్ సినిమాల్లో నటించినా, నటించకపోయినా పెద్ద తేడా ఏమీ లేదు. ఏది ఏమైనా ఈ రోజు పెళ్ళి చేసుకోబోతున్ననవనీత్ కి ఆల్ ది బెస్ట్ చెబుదాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X