పవన్ దర్శకుడు కళ్లు తెరిచిన వేళ...!
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'పంజా" సినిమాకు దర్శకత్వం వహించిన విష్ణు వర్ధన్ తొలి సారి కళ్లు తేరిన వేళ ఈ రోజు. కళ్లు తెరవడం అంటే కొంపతీసి ఇంకేదో డబుల్ మీనింగ్ లో ఆలోచించొద్దు. విష్ణు వర్ధన్ తొలిసారి ప్రపంచాన్ని చూసిన వేళ. ఇంకా విడమరిచి చెప్పాలంటే ఈ రోజు ఆయన పుట్టిన రోజు.
మణిరత్నం అంజలి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విష్ణువర్ధన్....పెద్దయ్యాక యాక్టర్‌గా కాకుండా దర్శకత్వ శాఖలో తన ప్రతిభ నిరూపించుకుంటున్నాడు. అతి తక్కువ సినిమాలతోనే తమిళంలో అగ్రదర్శకుల జాబితాలో చేరిన విష్ణువర్ధన్ అజిత్ హీరోగా 'బిల్లా" లాంటి భారీ హిట్స్ అందించారు. తాజాగా తొలిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'పంజా" సినిమా రూపొందించారు. డిసెంబర్ 9న ఈ సినిమా విడుదల కాబోతోంది.
పంజా పాటలు సూపర్ హిట్ కావడంతో పాటు ట్రైలర్స్ కూడా కేక పుట్టించే విధంగా ఉండటంతో....పంజా సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి తమిళ ప్రేక్షకులను మెప్పించిన విష్ణు వర్ధన్, తెలుగు ప్రేక్షకులను, ముఖ్యంగా పవన్ అభిమానులను ఎంత మేరకు తృప్తి పరుస్తాడో? చూడాలి. ఏది ఏమైనా...హ్యాపీ బర్త్ డే విష్ణువర్ధన్.


Click it and Unblock the Notifications











