‘A’ బొమ్మ అయితే...

By Staff

Vinayakudu
గతంలో ఎన్నడూలేని విధంగా టాలీవుడ్ ఎ సర్టిఫికేట్ ఫిల్మ్స్ ని రూపొందించింది. అలాగే ఆ సినిమాల్లో మేజర్ షేర్ పెద్ద స్టార్స్ నటించినవే కావటం విశేషం అంటున్నారు విశ్లేషకులు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రీజనల్ ఆఫీసర్ టి.వి.కె.రెడ్డి ఈ విషయమై మాట్లాడుతూ..ఎ సర్టిఫికేట్ ని వయిలెన్స్ ఎక్కువుగా ఉన్న చిత్రాలకు సాధారణంగా ఇష్యూ చేస్తూంటాం. అయితే ఆశ్చర్యంగా అవి భాక్సాఫీస్ వద్ద పెద్ద కలెక్షన్స్ కూడా సాధించక పోవటం గమనించతగ్గ అంసం. అయితే వీటివల్ల పరిశ్రమ వందకోట్ల దాకా నష్టపోయింటుందని అంచనా అన్నారు. అలాగే యు సర్టిఫికేట్ అందుకున్న లొ బడ్జెట్ చిత్రాలైన కొత్త బంగారు లోకం,వినాయకుడు,పరుగు,ఆవకాయ బిర్యాని,గమ్యం మంచి పేరు తెచ్చుకుని రికార్డు కలెక్షన్స్ నిర్మాతలకు తెచ్చిపెట్టాయి అన్నారు.

ఈ విషయమై ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు స్పందిస్తూ..తెలుగు ప్రేక్షకులువయిలెంట్ చిత్రాలు చూడ్డానికి ఇష్టపడటం లేదనే విషయం ఫిల్మ్ మేకర్స్ కి ఇప్పడిప్పుడే అర్ధమవుతోంది.అయినా ధియోటర్ కొచ్చి సినిమా చూసే ఆడియన్స్ లో అరవై శాతం మంది యంగస్టర్స్. వారిని ఫాక్షనిజం,కిడ్నాప్,మర్డర్స్ వంటి ధీమ్స్ తో చేసిన సినిమాలు ఆకట్టుకోవటం లేదు. సున్నితమైన సినిమాలు వారు కోరుకుంటున్నారు. అలాగే సినిమాలను చాలా సెలక్టివ్ గా చూస్తున్నారు. మేం కూడా సినిమాలను రూపొందించుకోవటంలో ఇవన్నీ పరిగణంలోకి తీసుకోవాలి.

ఇదే విషయాన్ని ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ విజియేంద్ర రెడ్డి కన్ఫర్మ్ చేస్తున్నారు. హింస ఎక్కువగా ఉన్న సినిమాలు కాలేజీ పిల్లలను,కుటుంబాలను దూరం పెడుతున్నారు. ఇంకా రాయలసీమ ఫ్యాక్షనిజం కథలు పట్టుకుని సినిమాలు తీస్తే కష్టం. మాకూ ఎ సర్టిఫికేట్ సినిమాలను ప్రదర్శించటం ఇష్టం ఉండదు అన్నారు. రెడీ హిట్టుతో ఈ సంవత్సరం దాటిన స్రవంతి రవికిషోర్ స్పందిస్తూ..మేం అన్ని వర్గాల వారికి నచ్చాలనే సినిమాలు రూపొందిస్తాం. అయితే సినిమాలో చిన్న ఫైట్ ఉంటే చాలు U/A సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు అంటూ వాపోయారు. రెడీకి U/A సర్టిఫికేట్ ఇచ్చారని ఆయన అన్నారు. ఇక ఈయేడు ఎ సర్టిఫికేట్ అందుకున్న పెద్ద సినిమాలో కొన్ని..పవన్ జల్సా,బాలయ్య ఒక్క మగాడు,విశాల్ సెల్యూట్,మహేష్ అతిధి,జగపతి హోమం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X