For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2014: టాలీవుడ్ లో షాకింగ్ మరణాలు(ఫొటో ఫీచర్)

By Srikanya
|

హైదరాబాద్ : 2014 సినిమావాళ్లకు ముఖ్యంగా తెలుగు సినిమావారికి కలిసి వచ్చినట్లు లేదు. మంచి మంచి ఆర్టిస్టులను తీసుకుపోయి...చేదుని మిగిలిస్తూ వచ్చే సంవత్సరంలోకి వెళ్తోంది. ఈ సంవత్సరం మొదట నుంచీ వరసగా షాకింగ్ మరణాలు జరగటం టాలీవుడ్ ని విస్తుపోయేటట్లు చేస్తోంది.క్రితం సంవత్సరం శ్రీహరి, ఎవియస్ , ధర్మవరపు సుబ్రమణ్యం అంటూ పెట్టిన వరస ఇంకా పూర్తి కానట్లు అందరినీ విషాదంలో ముంచుతూ 2014 సాగింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వయస్సు మీరి మరణిస్తే సహజం అనుకోవచ్చు...పెద్దగా ఆశ్చర్యోపోవాల్సింది,విస్తుపోవాల్సిందీ లేదు. అలా కాకుండా ఊహించని రీతిలో మరణాలు సంభవిస్తున్నాయి. మొన్న ఉదయ్ కిరణ్ నుంచి నిన్నటి ఉదయ్ కిరణ్ వరకూ చిన్న వయస్సు వారే. ఉదయ్ కిరణ్, చక్రి మరణాలు అయితే అసలు ఊహకే అందలేదు.

2014 జనవరిలో ఉదయకిరణ్ చాలా చిన్న వయస్సులో ఆత్మ హత్య చేసుకుని అభిమానులను కలవరపరిచారు. అలాగే చక్రి కరెక్టు గా కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు కేవలం 40 సంవత్సరాల వయస్సులో హార్ట్ ఎటాక్ తో మృత్యువుని ఆహ్వానించి నివ్వెరపరిచారు. వీరందికీ నివాళులు అర్పిస్తూ ఓ సారి అందరినీ గుర్తు చేసుకుందాం.

స్లైడ్ షోలో...

ఉదయ్ కిరణ్

ఉదయ్ కిరణ్

యువ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య కు అసలు కారణాలేంటనేవి ఇప్పటికీ తెలియకపోయినా ఆయన మరణం మరువలేనిది. డిప్రెషన్, అవకాశాలు లేకపోవటం, ఒత్తిడి ఆయన్ను చిన్న వయస్సులోనే బలి తీసుకున్నాయి.

అక్కినేని నాగేశ్వరరావు

అక్కినేని నాగేశ్వరరావు

మనం చిత్రంలో ఆఖరిగా కనిపించిన దాదా ఫాల్కే సాహెబ్ అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు గారు...ఈ సంవత్సరం మనల్ని వదలి...కాన్సర్ బారిన పడి చివరి క్షణాల వరకూ అందరికీ ధైర్యం చెప్పి కళామతల్లికి బైబై చెప్పారు.

బాపు

బాపు

తన బొమ్మలతో తెలుగువారి జీవితాల్లో చెరుగని ముద్రవేసి వెళ్లిపోయారు బాపు. ఆయన మృతి తెలుగు వారందరినీ భాధించింది. ఓ దర్శకుడుగా, చిత్రకారుడుగా, కార్టూనిస్టుగా ఆయన కళామతల్లికి మద్దుబిడ్డగా సేవలు చేసారు.

తెలంగాణా శకుంతల

తెలంగాణా శకుంతల

తెలుగు తెరపై టిపికల్ తెలంగాణ స్లాంగుతో అదరగొట్టిన నటి తెలంగాణశకుంతల. విలనిజం,కామెడీ, సెంటిమెంట్...ఇలా ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించగల సత్తా ఉన్న నటి ఆమె. అటువంటి మహానటి నేడు మన మధ్య లేక పోవడం బాధాకరం. 63 సంవత్సరంలో గుండెపోటుతో ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.

నందమూరి జానకీ రామ్

నందమూరి జానకీ రామ్

హరికృష్ణ కుమారుడు, జూ.ఎన్టీఆర్ సోదరుడు అయిన నందమూరి జానకీరామ్ మృతి తెలుగు చిత్ర పరిశ్రమని కుదిపేసిందనే చెప్పాలి. ఎప్పుడూ నవ్వుతూ ఉండి,కూల్ గా తన పనులు చేసుకుంటూ పోయే ఆయన యాక్సిడెంట్ కు గురి అవటం ఇప్పటికీ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

పి.జె శర్మ

పి.జె శర్మ

వెండితెర జడ్జిగా పేరొందిన సీనియర్‌ నటుడు.. సాయికుమార్‌, రవిశంకర్‌ రూపంలో ఇద్దరు డైలాగ్‌ కింగ్‌లను వెండితెరకు అందించిన పి.జె.శర్మ (80).. ఇక లేరని అనేది జీర్ణించుకోవటం కష్టమే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఆదివారం ఉదయం ఏడున్నర గంటలకు గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు.

చక్రి

చక్రి

స్వయంకృషితో సంగీత దర్శకుడిగా తెలుగు సినీ చరిత్రలో తనదంటూ ఒక పేజీని లిఖించుకున్న చక్రి.. ఇక లేరు. సోమవారం ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. సంగీతాభిమానులను దిగ్ర్భాంతికి గురి చేస్తూ నాలుగు పదుల వయసులోనే మరలిరాని లోకాలకు తరలిపోయారు.

English summary
Right from the start of the year 2014 to now, some shocking deaths have happened in filmnagar circuit.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more