విజయ్ దేవరకొండతో ఏజెంట్ బాక్సాఫీస్ ఫైట్.. ఓకే నెలలో 4 అద్భుతమైన సినిమాలు!
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు రికార్డులను బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఒక విధంగా చాలా వరకు పాన్ ఇండియా మార్కెట్లో సక్సెస్ అయ్యే సినిమాలే రాబోతున్నాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఏడాది చివరిలో కొన్ని ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు విడుదల కాబోతున్నాయి.
విజయ్ దేవరకొండ ఖుషి సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సమంత నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో అయితే ఒక టాక్ అనిపిస్తోంది. ఖుషి సినిమా అయితే డిసెంబర్ 23వ తేదీన విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఆ సినిమాకు దగ్గరలోనే అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమా కూడా విడుదల కాబోతోంది. ఖుషి సినిమా విడుదల కంటే ఒకరోజు ముందుగానే ఏజెంట్ సినిమా డిసెంబర్ 22వ తేదీన పాన్ ఇండియా ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవకాశం ఉన్నట్లు సమాచారం. క్రిస్మస్ సెలవులు ఉండడంతో ఆ మూమెంట్ లో తప్పకుండా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని ఈ రెండు సినిమాలు కూడా టార్గెట్ గా పెట్టుకున్నాయి.
లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ నెలలో అయితే మొత్తంగా నాలుగు అద్భుతమైన సినిమాలు రాబోతున్నాయి. అలాగే నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మాలిని కలయికలో రాబోతున్న జై బాలయ్య సినిమా డిసెంబర్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు ప్రపంచమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అవతార్ 2 సినిమా డిసెంబర్ 16వ తేదీన విడుదల కాబోతోంది. తెలుగులో కూడా ఆ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి ఈ సినిమాలన్నీ ఏ స్థాయిలో ప్రాఫిట్స్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











