Don't Miss!
- News సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వే
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
అలీ హాలీవుడ్ ఎంట్రీ.. ఆ కమెడియన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి
టాలీవుడ్ కమెడియన్ అలీ హాలీవుడ్ సినిమా రేంజ్‌కి ఎదిగిపోయాడు. వెండితెరపై నవ్వులు కురిపిస్తూ ఏ పాత్రలో అయినా అలా లీనమైపోయే అలీ.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో దాదాపు అన్ని భాషల్లో సినిమాలు చేశాడు. సౌత్ నుంచి నార్త్ వరకూ తన ఎంటర్టైన్మెంట్ ఎక్స్‌ప్రెస్‌తో అన్ని స్టాపుల్లో నవ్వులు పంచారు. ఇక దాన్నే కంటిన్యూ చేస్తూ ఈ స్టార్ కమేడీయన్ హాలీవుడ్‌లోనూ పర్వేశించబోతున్నాడు.
జగదీష్ దానేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు అలీ. ఒక స్ట్రయిట్ హాలీవుడ్ చిత్రం చేస్తున్న తొలి భారతీయ దర్శకుడు జగదీష్ దానేటి అని చిత్రబృందం తెలిపింది. ఈ ఇండో హాలీవుడ్ సినిమాను హాలీవుడ్‌కు చెందిన మార్టిన్ ఫిల్మ్స్, పింక్ జాగ్వర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు నిర్మించనున్నాయి. ఈ సినిమా చిత్రీకరించడానికి అనుమతి విషయమై సమాచార, ప్రసారల శాఖమంత్రి ప్రకాష్ జవడేకర్‌ను కలిశారు అలీ, దర్శకుడు జగదీష్ దానేటి.
అనంతరం అలీ మాట్లాడుతూ.. ''హాలీవుడ్ సినిమా చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. హలీవుడ్ సినిమా చేయాలనుకునేవాళ్లకు జగదీష్ ఓ మార్గం చూపించేలా ఉంటాడనుకుంటున్నాను. మంత్రి ప్రకాష్ జవడేకర్గారికి కృతజ్ఞతలు'' అని చెప్పాడు.
దర్శకుడు జగదీష్ మాట్లాడుతూ.. ''ఇండో హాలీవుడ్ సినిమాల్లో ఇదో ఉదాహరణగా నిలిచే చిత్రమవుతుంది. అలీ గారిని హాలీవుడ్లో పరిచయం చేయడం అదృష్టంలా భావిస్తున్నాను. త్వరలోనీ మరిన్ని వివరాలు ప్రకటిస్తాం'' అన్నాడు.