twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలీ హాలీవుడ్‌ ఎంట్రీ.. ఆ కమెడియన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి

    |

    టాలీవుడ్ కమెడియన్ అలీ హాలీవుడ్ సినిమా రేంజ్‌కి ఎదిగిపోయాడు. వెండితెరపై నవ్వులు కురిపిస్తూ ఏ పాత్రలో అయినా అలా లీనమైపోయే అలీ.. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీల్లో దాదాపు అన్ని భాషల్లో సినిమాలు చేశాడు. సౌత్‌ నుంచి నార్త్‌ వరకూ తన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్స్‌ప్రెస్‌తో అన్ని స్టాపుల్లో నవ్వులు పంచారు. ఇక దాన్నే కంటిన్యూ చేస్తూ ఈ స్టార్‌ కమేడీయన్‌ హాలీవుడ్‌లోనూ పర్వేశించబోతున్నాడు.

    జగదీష్‌ దానేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో హాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు అలీ. ఒక స్ట్రయిట్‌ హాలీవుడ్‌ చిత్రం చేస్తున్న తొలి భారతీయ దర్శకుడు జగదీష్‌ దానేటి అని చిత్రబృందం తెలిపింది. ఈ ఇండో హాలీవుడ్‌ సినిమాను హాలీవుడ్‌కు చెందిన మార్టిన్‌ ఫిల్మ్స్, పింక్‌ జాగ్వర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు నిర్మించనున్నాయి. ఈ సినిమా చిత్రీకరించడానికి అనుమతి విషయమై సమాచార, ప్రసారల శాఖమంత్రి ప్రకాష్‌ జవడేకర్‌ను కలిశారు అలీ, దర్శకుడు జగదీష్‌ దానేటి.

    Tollywood actor Ali enter into the Hollywood Movies

    అనంతరం అలీ మాట్లాడుతూ.. ''హాలీవుడ్‌ సినిమా చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. హలీవుడ్‌ సినిమా చేయాలనుకునేవాళ్లకు జగదీష్‌ ఓ మార్గం చూపించేలా ఉంటాడనుకుంటున్నాను. మంత్రి ప్రకాష్‌ జవడేకర్‌గారికి కృతజ్ఞతలు'' అని చెప్పాడు.

    దర్శకుడు జగదీష్‌ మాట్లాడుతూ.. ''ఇండో హాలీవుడ్‌ సినిమాల్లో ఇదో ఉదాహరణగా నిలిచే చిత్రమవుతుంది. అలీ గారిని హాలీవుడ్‌లో పరిచయం చేయడం అదృష్టంలా భావిస్తున్నాను. త్వరలోనీ మరిన్ని వివరాలు ప్రకటిస్తాం'' అన్నాడు.

    English summary
    Tollywood actor Ali enter into the Hollywood industry. He starts a movie in Jagadeesh dhaneti.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X