స్పష్టంగా చెప్పాను.. అయినా అతిగాళ్లు అలానే చేస్తుంటారు.. అల్లు శిరీష్ షాకింగ్ ట్వీట్
అల్లు బ్రదర్ శిరీష్ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా ఈ హీరో పెద్దగా పట్టించుకోడు. అలాగే నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా శిరీష్ పెద్దగా వివాదాల జోలికి వెళ్లడు. కానీ ఇటీవల ఒక ఫైరింగ్ విషయాన్నీ చెబుతూ నెటీజన్స్ ని ఆకట్టుకున్నాడు. అలాగే ముందుగానే కౌంటర్ వేసేవాళ్ళ నోళ్లు లేవకుండా చేశాడు.
దేశ ఆర్థిక వ్యవస్థ కోసం..
ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ చాలా ఏళ్ళు వెనక్కి వెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమయంలో ఇండియా ఎకానమీ బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది అని భారత ప్రభుత్వం ప్రకటనలు విడుదల చేస్తూనే ఉంది. కానీ ఇప్పట్లో ప్రభుత్వం కుదురుకోవడం అయ్యే పనేనా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇండియన్ ఎకానమీ గురించి శిరీష్ కూడా తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు.

స్వదేశీ బ్రాండ్స్ వాడదాం
శిరీష్ వివరణ ఇస్తూ.. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇకమీదట వీలైనంత వరకు స్వదేశీ బ్రాండ్స్ వాడదాం అని. దీని ద్వారా మన స్వంత ఎకానమీను బలోపేతం చేయవచ్చు. విదేశీ ప్రొడక్ట్స్ ఉపయోగించకపోవడం అసాధ్యమైనది. కానీ వీలైనంత వరకు లోకల్ ప్రాడక్ట్ లనే కొనండి అంటూ శిరీష్ తన సోషల్ మీడియా ఎకౌంట్ లో అద్భుతంగా వివరించాడు.

ఇండియన్ ప్రాడక్ట్స్..
అందుకు ముందుగా తాను కొన్ని ఇండియన్ ప్రాడక్ట్స్ కొన్నట్లు కూడా అల్లు శిరీష్ ఒక ఫొటో పోస్ట్ చేశాడు. మొన్న నేను సూపర్ మార్కెట్లో కొనుక్కున్న సామాన్లు ఇవే అంటూ అన్ని భారతీయ బ్రాండ్స్ అని ట్వీట్ చేశాడు. దీంతో నెటీజన్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే కొన్నిసార్లు నెగిటివ్ కామెంట్స్ ని ఎదుర్కొన్న అనుభవం ఉన్న శిరీష్ ఈ సారి ముందే అలాంటి కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చాడు.

కొంతమంది అతిగాళ్లు..
మనలో చాలామంది భారతీయ బ్రాండ్స్ ఉపయోగించడం, ఆకాంక్ష కాదని భావిస్తారు. కానీ ఇక మీదట ఆలా కాదు. లోకల్ బ్రాండ్స్ వాడదాం. వాడుతున్నట్లు పైకి చెప్పుకుందాం. దయచేసి స్పష్టంగా చెప్పాను.. అయినా చెప్పిన మంచి విషయాన్ని వదిలేసి కొందరు అతిగాళ్లు కిండల్ చేస్తుంటారు. వాళ్ళని నేను లైట్ తీసుకుంటున్నా.. అని శిరీష్ తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చాడు


Click it and Unblock the Notifications











