ఆర్.నారాయణమూర్తి అరెస్ట్.. పోలీసులు అడ్డుపడి వార్నింగ్ ఇచ్చినా భయపడని ఎర్రన్న.. తగ్గేదేలే!
సినిమా ఇండస్ట్రీలో దాదాపు 99% శాతం నటీనటులు ఇతర టెక్నీషియన్స్ అందరూ కూడా డబ్బు ఆశతోనే వర్క్ చేస్తారు. వారికి వర్క్ మీద ఎంత నిబద్ధత ఉన్నా కూడా డబ్బు రాదు అంటే ఏ విషయానికి ఒప్పుకోరు. అయితే సినిమా ప్రపంచంలో డబ్బు ప్రధానం కాదని విలువలే గొప్పవని చాటి చెప్పిన వారిలో దర్శకుడు, నటుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి ఒకరు. అందరూ ఆయనను అభిమానంతో ఎర్రన్న అని పిలుచుకుంటారు. అయితే ఇటీవల ఆయనని పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Recommended Video

అప్పట్లో ఎన్నో బాక్సాఫీస్ హిట్స్
ఆర్.నారాయణమూర్తి ఎలాంటి సినిమా చేసినా కూడా తన సిద్ధాంతాలను దాటకుండా చూసుకుంటారు. కమర్షియల్ కోసం కాకుండా తను అనుకున్న పాయింట్ ను సినిమా ద్వారా చెప్పాలని అనుకుంటారు. ఒకనొక దశలో ఆయన విప్లవాత్మక సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకున్నాయి.

రైతులు నష్టపోయే అవకాశం ఉందని
ఇక సినిమాల్లో ఎలాగైతే సామాజిక అంశాలపై పోరాటం చేసే పాత్రల్లో కనిపిస్తారో అలాగే నిజం జీవితంలో కూడా అంతే స్వచ్చంగా ఉంటారు. ఎక్కువగా రైతుల సమస్యలపై స్పందిస్తుంటారు. ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల కారణంగా రైతులు నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చేస్తుండగా ఆర్.నారాయణమూర్తి కూడా వారితో కలిసి అడుగు వేశారు.

మద్దతు పలికిన ఎర్రన్న
రైతులకు మద్దతుగా 'ఛలో రాజ్ భవన్' ర్యాలీలో నడుం బిగించి వెళ్లారు. రైతులతో కూడా నినాదాలు చేస్తూ పోరాటానికి మద్దతు పలికారు. అయితే ర్యాలీ నిర్వహించవద్దని పోలీసులు ముందుగానే హెచ్చరించారు. అయినప్పటికీ ఎవరు వెనుకడుగు వేయలేదు. నారాయణమూర్తి కూడా రైతులతో కలిసి రాజ్ భవన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.

ఆర్.నారాయణమూర్తి అరెస్ట్
లోపలికి వెళ్లేందుకు అనుమతులు లేవని ఆందోళన చేస్తున్న రైతులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అందులో నారాయణమూర్తి కూడా ఉన్నారు.. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. గతంలో 2006లో బీహార్ లో కొత్త వ్యవసాయ చట్టాలను ఇలానే తీసుకు వచ్చినప్పుడు అక్కడ రైతు అనేవాడు లేకుండా పోతున్నాడు. ఇప్పుడు రైతన్నలు కూలీలుగా మారే దుస్థితి ఏర్పడింది. అందుకే వెంటనే ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని నారాయణమూర్తి తన వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications