twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉరితీసే వాడిని కూడా అడుగుతారు.. కేసీఆర్ ఒక్క మాటకు కూడా చెప్పలేదు.. బాబు మోహన్!

    |

    ప్రముఖ నటుడు, పొలిటీషియన్ బాబు మోహన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కుమారుడి మరణాన్ని గుర్తు చేసుకుని ఆవేదన చెందారు. అలాగే కేసీఆర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని బాబు మోహన్ వివరించారు. కానీ తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించారని అన్నారు. ఈ సంఘటన తనని ఎంతగానో బాధించిందని బాబు మోహన్ అన్నారు. కేసీఆర్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బాబు మోహన్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు.

    చిన్న పాపని రక్షించబోయి

    చిన్న పాపని రక్షించబోయి

    తన కొడుకు చిన్న పాపని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయాడని బాబు మోహన్ అన్నారు. బాబు మోహన్ తనయుడు పవన్ కుమార్ 2003 లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. చిన్న పాప తన కొడుకు బైక్‌కు సడెన్‌గా అడ్డం రావడంతో ఆ పని తప్పించబోయి డివైడర్‌కు ఢీ కొట్టాడు. నా కొడుకు మరణం వల్ల ఇప్పటికి తాను ఆవేదన అనుభవిస్తున్నానని బాబు మోహన్ అన్నారు. తాను ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ కార్యక్రమాలకు హాజరైన ప్రతి సారి ఇదే విషయాన్ని వివరిస్తానని బాబు మోహన్ అన్నారు.

    మీరు విచ్చలవిడిగా తిరిగి

    మీరు విచ్చలవిడిగా తిరిగి

    మీరు విచ్చలవిడిగా వాహనాల్లో తిరిగి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగల్చవద్దు అని బాబు మోహన్ అన్నారు. నా కొడుకు గుర్తు వచ్చినప్పుడల్లా నేనేం పాపం చేశాను, దేవుడు ఎందుకు నాకు ఈ శిక్ష విధించాడు అని భాదపడుతుంటానని బాబు మోహన్ అన్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న బాబు మోహన్ ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

    కేసీఆర్‌ని బావ అని పిలుస్తా

    కేసీఆర్‌ని బావ అని పిలుస్తా

    కేసీఆర్ కు, తనకు గ్యాప్ పెరిగిందనే వార్తలపై మోహన్ బాబు స్పందించారు. కేసీఆర్ తో నాకు 40 ఏళ్ల నుంచి స్నేహం ఉంది. నేను కేసీఆర్ ని బావా అని పిలుస్తా. కానీ నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా టికెట్ నిరాకరించారు. నువ్వు ఈ తప్పు చేశావు అని చెప్పి ఉంటే సరి చేసుకునే వాడిని లేదా నా వివరణ నేను ఇచ్చుకునే వాడిని. అసలు ఎమ్ జరిగిందో ఆ భగవంతుడికే తెలియాలి అని బాబు మోహన్ అన్నారు.

    ఉరి తీసేవాడిని కూడా

    ఉరి తీసేవాడిని కూడా

    అభ్యర్థుల ప్రకటనకు మూడు రోజుల ముందు కలిశా. నన్ను కౌగలించుకుని ఆప్యాయంగా మాట్లాడారు. కానీ అభ్యర్థుల లిస్ట్ లో నా పేరు లేదు. చాలా భాదపడ్డానని బాబు మోహన్ అన్నారు. ఉరి తీసేవాడిని కూడా చివరి కొరిక అడుగుతారు. ఆ గౌరవం కూడా కేసీఆర్ ఇవ్వలేదని బాబు మోహన్ అన్నారు. నన్ను ఎమ్మెల్యేని చేసింది ఆయనే అని, ఇప్పుడు అదే కేసీఆర్ తనని దూరం పెట్టాడని బాబు మోహన్ అన్నారు.

    English summary
    Tollywood Actor Babu Mohan sensational comments on CM KCR
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X